News March 16, 2025

ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు, రాష్ట్రంలోనే టాప్ కరీంనగర్

image

ఉమ్మడి జిల్లాలో ఎండ దంచికొడుతోంది. శనివారం కరీంనగర్ జిల్లా బూర్గుపల్లిలో 42.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో 41.5, జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో 41.1, పెద్దపల్లి జిల్లా మంథనిలో 40.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఈ ప్రాంతాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి.

Similar News

News March 17, 2025

కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

image

కరీంనగర్ జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా బురుగుపల్లి 41.6°C నమోదు కాగా, కొత్తపల్లి-ధర్మారం 40.9, వీణవంక 39.6, జమ్మికుంట, తాంగుల 39.3, చింతకుంట 39.0, ఇందుర్తి, ఈదులగట్టేపల్లి 38.8, ఆసిఫ్ నగర్ 38.7, నుస్తులాపూర్ 38.5, ఖాసీంపేట 38.4, మల్యాల 38.1, గంగాధర 38.0, బోర్నపల్లి, రేణికుంట 37.9, పోచంపల్లి 37.8, వెదురుగట్టు, కరీంనగర్ 37.7, గుండి 37.6°Cగా నమోదైంది.

News March 17, 2025

KNR: రాజీవ్ యువ వికాసం.. యువతలో ఆశలు..!

image

‘రాజీవ్ యువ వికాసం’తో ఉమ్మడి KNR జిల్లాలోని యువతలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఈ పథకం ద్వారా SC, ST, BC, మైనారిటీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయనున్నారు. ఈనెల 17 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హులైన వారికి రూ.3 లక్షలలోపు విలువైన యూనిట్లు మంజూరు చేయనున్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం https://tgobmms.cgg.gov.in సైట్‌ను వీక్షించవచ్చు. SHARE IT.

News March 16, 2025

జగిత్యాల: భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య, కుమారులు

image

JGTLరూరల్(M) పొలాసలో పడాల కమలాకర్(60)ను మొదటిభార్య, కుమారులు పెట్రోల్ పోసి శనివారం నిప్పంటించారు. గాయపడిన కమలాకర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లగా రాత్రి చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసుల ప్రకారం.. గతంలోనే కమలాకర్ 2 పెళ్లిళ్లు చేసుకున్నాడు. 3వ పెళ్లి చేసుకుని గ్రామంలోనే ఉంటున్నాడు. మద్యంతాగి మొదటి భార్య, కుమారులను వేధించేవాడు. కోపం పెంచుకున్న వారు కమలాకర్‌పై కత్తులతో దాడిచేసి పెట్రోల్ పోసి నిప్పటించారు.

error: Content is protected !!