News April 24, 2024
ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం అత్యధికంగా వనపర్తి జిల్లా కేతేపల్లిలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నాగర్ కర్నూలు జిల్లా కిష్టంపల్లిలో 43.8, మహబూబ్నగర్ జిల్లా సల్కర్పేటలో 43.6, గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 43.5, నారాయణపేట జిల్లా ధన్వాడలో 43.0 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News January 17, 2026
పాలమూరు: జిల్లాలో నేటి ముఖ్యంశాలు

✒రూ.1,284 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం
✒MBNR: CM ఇలాకా.. BRSలో భారీగా చేరికలు
✒పాలమూరు జిల్లా అభివృద్ధి సీఎం బాధ్యత: డీకే అరుణ
✒వనపర్తి:భార్య చేతిలో భర్త దారుణ హత్య
✒రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మనోళ్లను గెలిపించండి: సీఎం
✒సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన.. జర్నలిస్టులు ముందస్తు అరెస్ట్
✒పాలమూరులో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం:CM రేవంత్ రెడ్డి
News January 17, 2026
పాలమూరు జిల్లా అభివృద్ధి సీఎం బాధ్యత: డీకే అరుణ

పాలమూరు జిల్లా బిడ్డగా అభివృద్ధి చేయడం సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత అని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. గత సీఎంలు తమ జిల్లాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నారని, ఎక్కువ దృష్టి పెట్టి జిల్లాలో సస్యశాసమలంగా మార్చే బాధ్యత తనపై పూర్తిగా ఉందని సూచించారు. విద్య వైద్యం పై అధిక శ్రద్ధ చూపించి ఉపాధి కల్పన జిల్లాగా పేరు మార్చుకునేలా అభివృద్ధిలో దూసుకొని పోయేలా అడుగులు వేయాలన్నారు.
News January 17, 2026
బతుకమ్మ చీరలు చేలల్లో కట్టడానికే పనికొచ్చినయ్: CM

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరలు పట్టుకునేందుకు పనికి రాలేదని చేన్లలో పందులు రాకుండా అడ్డుకునేందుకు పనికి వచ్చాయని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలను ఆగం చేశారన్నారు.


