News April 7, 2024
ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధులు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరికి రక్త పోటు(BP) లేదా మధుమేహంతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఈ రెండు జబ్బుల బారినపడి వారు MBNR జిల్లాలో 89,387 మంది, NGKL జిల్లాలో 68,574, NRPT జిల్లాలో 54,232, జోగులాంబ గద్వాల జిల్లాలో 52,265, వనపర్తి జిల్లాలో 42,448 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మూత్రపిండాలు దెబ్బతిని ప్రతినెలా డయాలసిస్(రక్తశుద్ధి) చేయించుకుంటున్న బాధితులు 1,242 మంది ఉన్నారు.
Similar News
News November 9, 2024
నూతన రైల్వే లైన్లతో మహబూబ్ నగర్ అభివృద్ధి: ఎంపీ మల్లు రవి
సికింద్రాబాద్ లోని రైల్ నిలయం కార్యాలయంలో దక్షణ మధ్య రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తో శుక్రవారం నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కొత్త రైల్వే మార్గాలను ఏర్పాటు చేయాలని రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి చెందుతుందని మల్లు రవి చెప్పారు.
News November 9, 2024
స్కాట్లాండ్ పర్యటనలో మంత్రి, ఎమ్మెల్యేలు
స్కాట్లాండ్‌లోని ఎడింబర్గ్ కాసిల్‌ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, డా.వంశీకృష్ణ, రాజేష్ రెడ్డి, జనంపల్లి అనిరుధ్ రెడ్డి, లక్ష్మీకాంతరావు సందర్శించారు. మూడు రోజులుగా వరల్డ్ ట్రావెల్ మార్కెట్లో రాష్ట్రంలోని టూరిజాన్ని ప్రమోట్ చేశారు.
News November 8, 2024
ఉమ్మడి పాలమూరులో నేటి..TOP NEWS!!
✔రేపు,ఎల్లుండి ఓటర్ నమోదుకు స్పెషల్ డ్రైవ్✔ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.. పలుచోట్ల అన్నదానం✔PUలో ఖో-ఖో క్రీడాకారుల ఎంపిక✔ఆత్మకూరు: ఉద్దాల ఊరేగింపు మహోత్సవం ప్రారంభం✔GDWL: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య✔సమగ్ర సర్వేకు ప్రజలందరూ సహకరించాలి: కలెక్టర్లు✔10న కురుమూర్తికి సీఎం రేవంత్ రెడ్డి రాక.. ఏర్పాట్లపై ఫోకస్✔అవినీతిలో ఉమ్మడి పాలమూరు టాప్