News October 4, 2024

ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నవ రాత్రులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఇంట్లోనే కాక, వీధుల్లో ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి అమ్మవారు నవరాత్రుల మొదటి రోజున దుర్గామాత శైలపుత్రిగా దర్శనిమిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా కట్టుపొంగలి, చవివిడి,వడపప్పు ప్రసాదంగా పెడతారు. 6వ రోజున వేడుకలు, పూజలు ప్రారంభమవుతాయి. తరువాతి మూడు రోజులలో దుర్గ, లక్ష్మి, సరస్వతి వివిధ రూపాలలో పూజిస్తారు.

Similar News

News November 6, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔GET READY..రేపటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే ✔11న కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి ✔NRPT:చిరుతపులి దాడిలో మేకలు మృతి ✔MBNR:పీఎంశ్రీకి 119 పాఠశాలలు ఎంపిక ✔కడ్తాల్: మహిళ మృతదేహం లభ్యం ✔MBNR:ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. ప్రారంభమైన రాజకీయ వేడి ✔GDWL:సెల్ ఫోన్ల రికవరీలో పోలీసుల ఉత్తమ ప్రతిభ ✔ప్రతి ఇంటిపై స్టిక్కర్లు అతికించాలి:కలెక్టర్లు ✔కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్:AITUC

News November 5, 2024

11న కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి 

image

పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి బ్రహ్మోత్సవాలు పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 11న కురుమూర్తికి రానున్నారు. సీఎం రాక కోసం మంగళవారం స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు కూడా  కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు హాజరుకానున్నారు.

News November 5, 2024

అలంపూర్: అధికారిక చిహ్నం మార్పు.. కలెక్టర్ స్పష్టత

image

జోగులాంబ గద్వాల జిల్లా, కర్నూల్ అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో అలంపూర్ వద్ద ఆర్టీఏ చెక్ పోస్ట్ దగ్గర అధికారులు పెట్టిన బారీకేడ్లపై అధికారిక చిహ్నం మార్పు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. దీనిపై జోగులాంబ కలెక్టర్ స్పందించారు. వెంటనే తప్పుడు లోగో ఉన్న బారీకేడ్లను తొలగించినట్లు కలెక్టర్ తెలిపారు.