News April 18, 2024

ఉమ్మడి జిల్లాలో భగభగమంటున్న భానుడు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్, బేల, జైనథ్, సిరికొండ, బోథ్, మావల, పిప్పల్ధరి, చెప్రాల, భోరజ్ ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమురం భీం జిల్లాలో అత్యధికంగా కాగజ్ నగర్లో 44.2 డిగ్రీలు నమోదయింది. మంచిర్యాల జిల్లాలో కోటపల్లి మండలం దేవులవాడలో అత్యధికంగా 44, నిర్మల్ జిల్లాలో దస్తూరాబాద్లో 43.2 డిగ్రీలు నమోదైంది.

Similar News

News April 23, 2025

MNCL: జిల్లాలో విషాదం.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

image

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లక్షెట్టిపేటలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని సుస్మిత (16) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపం చెంది ఉరేసుకుందన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 23, 2025

సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన ADB బిడ్డ

image

UPSC సివిల్స్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా యువకుడు ఆదా సందీప్ సత్తా చాటాడు. ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వెంకటేష్-వాణి దంపతుల చిన్న కుమారుడు సందీప్ సివిల్స్ ఫలితాల్లో 667 ర్యాంక్ సాధించాడు. గతంలో తొలి ప్రయత్నంలో 830 ర్యాంక్ సాధించాడు. అదే పట్టుదలతో మళ్లీ పరీక్ష రాసి ఇప్పుడు 667 ర్యాంక్ సాధించడంతో కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సందీప్‌ను అభినందించారు.

News April 23, 2025

9 నుంచి 27 ర్యాంక్‌కు పడిపోయిన ADB జిల్లా

image

ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. ADB జిల్లాలో ఫస్టియర్ 9,106 మంది పరీక్షలు రాయగా 4,967 మంది పాసయ్యారు. సెకండియర్‌లో 8,890కి 6,291 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం ఫస్టియర్‌లో 54.55, సెకండియర్‌లో 70.76గా నమోదైంది. ఫస్టియర్‌లో రాష్ట్రంలో జిల్లా గతేడాది 9వ స్థానంలో ఉండగా.. ఈసారి 27వ స్థానంలో నిలిచింది. సెకండియర్ గతేడాది 13వ ప్లేస్‌లో ఉండగా ఈసారి 12వ స్థానంలో నిలిచింది.

error: Content is protected !!