News December 3, 2024

‘ఉమ్మడి జిల్లాలో మద్యం బంద్’

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 3వ సాయంత్రం 4 గంటల నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు మద్యం షాపులు మూసి వేయనున్నట్లు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ కె.ఎస్.వి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. సోమవారం రాత్రి ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల దృష్ట్యా మధ్య విక్రయిస్తే చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.

Similar News

News December 7, 2025

భీమవరం ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్

image

భీమవరం ఏరియా ఆసుపత్రిలో సుమారు రూ.2 కోట్ల CSR నిధులతో నిర్మించే డయాలసిస్ సెంటర్‌కు ఆదివారం కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే రామాంజనేయులు, కలెక్టర్ నాగరాణి భూమిపూజ చేశారు. 8 యంత్రాలు, 10 బెడ్లతో ఈ సెంటర్ నిర్మాణం జరుగుతుందన్నారు. ఇది అందుబాటులోకి వస్తే రోగులకు మెరుగైన వైద్య సేవలు లభించి, దూర ప్రాంతాలకు వెళ్లే కష్టం తప్పుతుందని వారు పేర్కొన్నారు.

News December 7, 2025

భీమవరం: రేపు యథావిధిగా PGRS- కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, మండల స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ప్రజలనుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యాలయానికి రాలేనివారు 1100 కాల్ సెంటర్‌ ద్వారా లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News December 7, 2025

HIV బాధితుల పట్ల వివక్ష చూపొద్దు: మంత్రి నిమ్మల

image

2030 నాటికి HIV రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తునట్లు మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో HIV బాధితులకు చేయూత కార్యక్రమంలో ఆదివారం మంత్రి పాల్గొన్నారు. HIV బాధితులకు పౌష్టికాహారం, నిత్యవసర సరుకుల బ్యాగులను మంత్రి పంపిణీ చేసారు. సమాజంలో HIV బాధితుల పట్ల మానవత్వం, ప్రేమానురాగాలతో మెలగాలని, వారి పట్ల వివక్ష చూపవద్దని కోరారు.