News April 25, 2024
ఉమ్మడి జిల్లాలో వరంగల్ లాస్ట్
ఇంటర్ ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనకబడింది. ఫస్టియర్ ఫలితాల్లో 24వ స్థానం సాధించగా.. సెకండియర్ ఫలితాల్లో 26వ స్థానంలో నిలిచింది. సెకండియర్ ఫలితాల్లో ములుగు జిల్లా 82.95 శాతంతో తొలి స్థానంలో, ఫస్టియర్ ఫలితాల్లో 70.01శాతంతో 3వ స్థానంలో నిలిచింది. కాగా, WGL 2021-22లో రాష్ట్రంలో ఫస్ట్, సెకండియర్ ఫలితాల్లో 25వ స్థానంలో నిలవగా.. 2022-23లో ఫస్టియర్‌లో 27వ స్థానం, సెకండియర్ ఫలితాల్లో 33వ స్థానంలో నిలిచింది.
Similar News
News January 9, 2025
పదవీ విరమణ చేసిన హోంగార్డ్‌ను సత్కరించిన WGL సీపీ
సుధీర్ఘ కాలం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో హోంగార్డ్ విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన హోం గార్డ్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ గురువారం క్యాంప్ కార్యక్రమంలో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. భవిష్యత్‌లో ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని హోం గార్డ్‌కు సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ సురేశ్ కుమార్, ఏసీపీ నాగయ్య, ఆర్.ఐ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
News January 9, 2025
మహబూబాబాద్: ABSF ఆధ్వర్యంలో షేక్ ఫాతిమా జయంతి
మహబూబాబాద్లో మొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు షేక్ ఫాతిమా జయంతి వేడుక నిర్వహించారు. అఖిల భారత స్టూడెంట్ ఫెడరేషన్ (ABSF) రాష్ట్ర అధ్యక్షుడు ఇనుగుర్తి సుధాకర్ ఆధ్వర్యంలో ఫాతిమా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రభుత్వం ఫాతిమా జయంతిని అధికారింగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంజీవరావు, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.
News January 9, 2025
శ్రీ భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ
భద్రకాళి దేవస్థానంలో నేడు ధనుర్మాసం గురువారం సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయాన్నే ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.