News September 18, 2024

ఉమ్మడి జిల్లాలో వేరుశనగ సాగుకు రైతులు సన్నద్ధం !

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేరుశనగను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వర్షాలు పుష్కలంగా కురవడంతో ఈ ఏడాది 2.60 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అత్యధికంగా NGKL జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో ఆ తరువాత వనపర్తి జిల్లాలో 40 వేల ఎకరాల్లో వేరుశనగ సాగు చేయనున్నారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

Similar News

News September 29, 2024

MBNR: ఓటరు జాబితా OK.. రిజర్వేషన్లే అసలు తంతు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఓటరు తుది జాబితా అన్ని గ్రామాల్లో అధికారులు ప్రదర్శించారు. దీంతో గ్రామాల్లో రిజర్వేషన్ల పైనే చర్చ నడుస్తుంది. 2018 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్‌ను పది సంవత్సరాలు కొనసాగించాలని గత ప్రభుత్వం చట్టం చేసింది. బీసీకు వార్డులు, పంచాయతీల రిజర్వేషన్లు పెంచేందుకు తెరపైకి రావడంతో ప్రభుత్వం ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

News September 29, 2024

MBNR: దివ్యాంగుడిని బ్రతికుండగానే చంపేశారు!

image

బతికున్న వ్యక్తిని ఆసరా పింఛను పోర్టల్‌లో చనిపోయినట్లు నమోదు చేయడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కృష్ణ మండలం ఖాన్‌దొడ్డి గ్రామానికి చెందిన హన్మంతు దివ్యాంగ పెన్షన్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత పెన్షన్ మంజూరు కాలేదని ఆరా తీయగా.. అధికారులు ఆసరా పోర్టల్‌లో చూసి’ నీవు చనిపోయినట్లు ఆసరా పోర్టల్‌లో ఉంది’ అని తెలిపారు. దీంతో హన్మంతు 6 నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.

News September 29, 2024

ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రత వివరాలు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా వనపర్తి జిల్లా కానాయపల్లిలో 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో 35.0 డిగ్రీలు, గద్వాల జిల్లా తోతినొనిద్దోడిలో 35.6 డిగ్రీలు, మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో 33.8 డిగ్రీలు, నారాయణపేట జిల్లా బిజ్వార్‌లో 32.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.