News April 6, 2024
ఉమ్మడి జిల్లాలో శుభకార్యాల వేళ ఎన్నికల కోడ్ కష్టాలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ నెల 9 నుంచి 28 వరకు ఎక్కువమంది పెళ్లిళ్లకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి సామాగ్రిని సమకూర్చుకోవడానికి వివిధ ఖర్చుల నిమిత్తం షాపింగ్ చేసుకుంటున్నారు. ఆన్లైన్ చెల్లింపులకు ఆదాయపు పన్ను శాఖ ఆంక్షలు ఉండడం, ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో రూ.50 వేలకు మించి నగదు తీసుకువెళ్తే పోలీసులు తనిఖీలు చేస్తుండడంతో.. వారు ఇబ్బందులు పడుతున్నారు.
Similar News
News January 16, 2025
కనులపండువగా భద్రాద్రి రామయ్య నిత్యకళ్యాణం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో స్వామివారికి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం, నిత్య బలిహరణం, తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
News January 16, 2025
ప్రత్తి మార్కెట్ యార్డ్‌ను సందర్శించిన తుమ్మల
ఖమ్మం పత్తి మార్కెట్ యార్డులో అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాలన్ని మంత్రి తుమ్మల సందర్శించారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో అక్కడున్న వారిని అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.ఐజీతో మట్లాడి ఓ ఫైర్ ఇంజిన్ ను పర్మినెంట్ గా మార్కెట్ లో అందుబాటులో ఉంచాలన్నారు.
News January 16, 2025
ఖమ్మం: ఒక్క గ్రామంలో 10 మందికి టీచర్ ఉద్యోగాలు
ఎర్రుపాలెం మండలం రాజులడేవరపాడులో 10 మంది టీచర్ ఉద్యోగాలు సాధించారు. సంక్రాంతి సందర్భంగా గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించి కొలువులు సాధించిన వారిని గ్రామస్థులు సన్మానించారు. దుద్దకూరు గోపిక్రిష్ణ యాదవ్, దుద్దుకూరు కృష్ణ వేణి, పొదిల సాంబయ్య మరికొందరు జాబ్స్ కొట్టిన వారిలో ఉన్నారు.