News June 5, 2024
ఉమ్మడి జిల్లాలో సగం మంది పాలకులు మహిళలే

ఉమ్మడి వరంగల్ జిల్లాలో సగం మంది మహిళ ప్రజాప్రతినిధులు, అధికారులే పాలన కొనసాగిస్తున్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉంటే వారు మహిళలే కావడం విశేషం. WGL, HNK, ములుగు జిల్లాల కలెక్టర్లు కూడా మహిళా IASలే. వరంగల్, MHBD, భూపాలపల్లి ZP ఛైర్మన్లుగా వారే ఉన్నారు. GWMC మేయర్ గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్ రిజ్వానా ఉండగా.. తాజాగా నిన్న వరంగల్ ఎంపీగా కావ్య గెలిచారు. పాలకుర్తి MLAగా యశస్విని రెడ్డి ఉన్నారు.
Similar News
News November 24, 2025
వరంగల్ కలెక్టరేట్లో గ్రీవెన్స్ రద్దు

పరిపాలనాపరమైన కారణాల వల్ల సోమవారం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ప్రకటించారు. జిల్లా ప్రజలు వినతిపత్రాలతో కలెక్టరేట్‌కు రావొద్దని ఆమె సూచించారు. జిల్లా ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, తదుపరి కార్యక్రమాన్ని తెలియజేస్తామని ఆమె వివరించారు.
News November 22, 2025
వరంగల్‌లో ముగ్గురు సీఐల బదిలీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఇన్స్పెక్టర్లకు బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఓ. రమేష్ (మామూనూర్ ఇన్స్పెక్టర్)- వీఆర్‌కు, ఈ. శ్రీనివాస్ (ఐటీ కోర్ ఇన్స్పెక్టర్)- మామూనూర్ పోలీస్ స్టేషన్‌కు, ఏ. ప్రవీణ్(వీఆర్ ఇన్స్పెక్టర్)- ఐటీ కోర్ సెల్‌కు బదిలీ అయ్యారు.