News May 17, 2024

ఉమ్మడి జిల్లాలో 2 నగరాల్లో ఓటర్లలో చైతన్యం

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలోని రెండు నగరాల్లో ఓటర్ల చైతన్యంలో కాకినాడ ప్రథమ స్థానంలో నిలిచింది. కాకినాడలో అత్యధికంగా 72.16% పోలింగ్ జరిగింది. రాజమహేంద్రవరంలో 67.57% పోలింగ్ నమోదైంది. ఈ రెండు నగరాల్లో ఓటింగ్ శాతం గతం కంటే పెరిగింది. మరోవైపు 9 పట్టణాల్లో మండపేట, పిఠాపురం, నిడదవోలు ముందంజలో నిలిచాయి. మండపేటలో అధికంగా 85.72%, పిఠాపురంలో 83.48%, నిడదవోలులో 82.31% పోలింగ్ జరిగింది.

Similar News

News April 23, 2025

10th RESULTS: 6వ స్థానంలో తూర్పు గోదావరి

image

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 23,388 మంది పరీక్ష రాయగా 20,578 మంది పాసయ్యారు. 11,975 మంది బాలురులో 10,310 మంది, 11,413 మంది బాలికలు పరీక్ష రాయగా 10,268 మంది పాసయ్యారు. 87.99% పాస్ పర్సంటైల్‌తో తూర్పు గోదావరి 6వ స్థానంలో నిలిచింది.

News April 23, 2025

రాజమండ్రి: స్పా ముసుగులో వ్యభిచారం

image

రాజమండ్రిలో స్పాముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ స్పా‌ సెంటర్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. SI ఆదినారాయణ వివరాల ప్రకారం.. బ్యూటీషియన్ కోర్సు నేర్పిస్తామని చెప్పి యువతులకు ఎరవేసి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. SIకు వచ్చిన సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఐదుగురు యువతులు, ఐదుగురు విటులు పట్టుబడ్డారు. స్పా నిర్వాహకుడు మదన్, మేనేజర్ తేజశ్రీని అరెస్టు చేసి కేసు దార్యప్తు చేస్తున్నారు.

News April 22, 2025

తాళ్లపూడి: పుష్కరాల రేవులో శిశువు మృతదేహం లభ్యం

image

తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి పుష్కరాల స్నాన ఘట్టానికి వెళ్లే మార్గంలో ఆడ శిశువు మృతదేహాన్ని మంగళవారం స్థానికులు కనుగొన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొవ్వూరు సీఐ విజయబాబు ప్రాంతాన్ని సందర్శించి శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆడ శిశువు మృతదేహం లభ్యమవ్వడంతో చుట్టుపక్కల ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రులలో పోలీసులు విచారణ చేపట్టారు.

error: Content is protected !!