News September 8, 2024
ఉమ్మడి జిల్లాలో 2 వేలు ఉపాధ్యాయ ఖాళీలు
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 3,227 ప్రభుత్వ పాఠశాలల్లో 12,708 మందికి ప్రస్తుతం 10,225 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. 508 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి పరీక్ష నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలల్లో పని చేస్తున్న 1,975 మంది SGTలకు SAగా విద్యాశాఖ పదోన్నతి కల్పించింది.DSC ద్వారా కొత్త ఉపాధ్యాయులను నియమించినా ఇంకా సుమారు 2 వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. మరో DSCకి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.
Similar News
News October 6, 2024
MBNR: గ్రంథాలయ సంస్థలకు నూతన ఛైర్మన్‌లు
తెలంగాణలో బతుకమ్మ పండుగకు ముందు నామినేటెడ్ పోస్టుల భర్తీ జాతర మొదలైంది. తాజాగా పాలమూరు జిల్లాలోని గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్ – మల్లు నరసింహారెడ్డి, నాగర్ కర్నూల్ – జి. రాజేందర్, వనపర్తి – జి. గోవర్ధన్, గద్వాల- నీలి శ్రీనివాసులు, నారాయణ్‌పేట్-వరాల విజయ్ కుమార్‌ను జిల్లా గ్రంథాలయ సంస్థలకు నూతన ఛైర్మన్‌గా నియమించింది.
News October 6, 2024
NGKL: జీతాలు చెల్లించండి రేవంత్ సారూ..!
నాగర్ కర్నూల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమ జీతాలు చెల్లించాలని సీఎం రేంవత్ రెడ్డిని వేడుకుంటున్నారు. రెండు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. జీతాలు రాక ఇల్లు గడవడమే కష్టంగా ఉంటే.. ఇక బతుకమ్మ పండుగ ఎలా చేసుకోవాలని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దసరా పండుగ సమీపిస్తుంన్నందున ప్రభుత్వం స్పందించి తమ జీతాలు చెల్లించాలని కోరుతున్నారు.
News October 6, 2024
గద్వాల: మెడిసిన్ సీటు సాధించిన పేదింటి బిడ్డ
గద్వాల ఎర్రమట్టి వీధికి చెందిన పావని జమ్మన్న దంపతుల కూతురు వైష్ణవి మెడిసిన్‌లో సీటు సాధించింది. విషయం తెలుసుకున్న నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా ఛైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ ఆదివారం వారి ఇంటికి వెళ్లి సన్మానించి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. పేదింటి బిడ్డలు చదువులో రాణించి అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కన్వీనర్ బుచ్చిబాబు పాల్గొన్నారు.