News March 24, 2024
ఉమ్మడి జిల్లాలో 91,357 ఎకరాల్లో ఎండిన పంటలు
ఉమ్మడి జిల్లాలో యాసంగి సీజన్లో ప్రధానంగా వరి, వేరుశనగ, మొక్కజొన్న, జొన్న తదితర పంటలు సాగు చేశారు. మొత్తం 8,04,641 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కాగా అందులో 5,34,150 ఎకరాల్లో వరి సాగైనట్లు అధికారులు చెబుతున్నారు. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో నీరందక సుమారు 88,752 ఎకరాల్లో వరి, 2,605 ఎకరాల్లో వేరుశనగ, మొక్కజొన్న, మొత్తం 91,357 ఎకరాల్లో పంటలు ఎండినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Similar News
News January 9, 2025
MBNR: మద్దిమడుగు ఆంజన్న రూ.14 కోట్ల ఆస్తిపరుడు
మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలంలో ప్రసిద్ధిగాంచిన మద్దిమడుగు ఆంజనేయ స్వామి రూ.14 కోట్లకు ఆస్తిపరుడు. భక్తులు కానుకల రూపంలో ఇచ్చిన సొమ్మును దేవాదాయ శాఖ అధికారులు బ్యాంకులో జమ చేస్తున్నారు. ఇప్పటివరకు రూ.14 కోట్లు దేవుడి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లుగా ఉన్నట్లు ఈవో రంగాచారి వెల్లడించారు. ఆ మొత్తానికి వచ్చిన వడ్డీని సైతం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్‌గా చేస్తున్నామని తెలిపారు.
News January 9, 2025
అమరచింత: జూరాల ప్రాజెక్టు నేటి నీటి సమాచారం
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నేటి సమాచారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.225 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆవిరి ద్వారా 83 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 550, కుడి కాలువకు 400, మొత్తం అవుట్‌ఫ్లో 1,481 క్యూసెక్కులను వదులుతున్నట్లు తెలిపారు.
News January 9, 2025
MBNR: 11న కురుమూర్తి స్వామి పుణ్యక్షేత్రంలో గిరి ప్రదక్షణ
పేదల తిరుపతిగా ప్రసిద్దిగాంచిన ఉమ్మడి MBNR జిల్లాలోని కురుమూర్తి స్వామి ఆలయంలో ఈ నెల 11వ తేదీన గిరి ప్రదక్షణ ప్రారంభం కానుంది. అయోధ్యలో బాలరాముడి విగ్రహా ప్రతిష్ట జరిగి ఆరోజుకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.