News November 9, 2024
ఉమ్మడి జిల్లాలో ACBకి పట్టుబడిన అధికారులు వీళ్లే!2/2

JUN 12న నరసింహస్వామి(అసిస్టెంట్ కమాండెంట్),అబ్దుల్ వహెద్(రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ),25న ఎం.రవి(SI),విక్రం(102 అంబులెన్స్ డ్రైవర్),JUL 3న శివ శ్రీనివాసులు (MRO),25న బాలరాజు(ఐకేపీ సర్వేయర్),SEP 3న వెంకటేశ్వర్ రావు (ఏసీటీఓ),OCT 22న ఆదిశేషు(మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2),NOV 7న రవీందర్(DEO)లు ACBకి పట్టుబడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే సమాచారం ఇవ్వాలని ఏసీబీ ఇన్ఛార్జ్ DSP శ్రీకృష్ణ గౌడ్ తెలిపారు.
Similar News
News November 22, 2025
MBNR: పరీక్షలు ప్రారంభం.. అన్ని వసతులు కల్పించాం:పీయూ వీసీ

పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ బీఏ,బీకాం,బీఎస్సీ, బీబీఏ బీఎ(L) (CBCS) సెమిస్టర్-I, III, V రెగ్యులర్, బ్యాక్లాక్ ఎగ్జామినేషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ మెంబర్స్కి విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ ఎగ్జామినేషన్ బ్రాంచ్లో ఆర్డర్ కాపీలను అందజేశారు. వీసీ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 47 పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించామన్నారు.
News November 22, 2025
MBNR: డిగ్రీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: ఉపకులపతి

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో శనివారం నుంచి నిర్వహించి డిగ్రీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఉపకులపతి ఆచార్య జీఎన్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అన్ని కేంద్రాలకు వెళ్లే ఫ్లైయింగ్ స్క్వాడ్, సిట్టింగ్స్ స్క్వాడ్లకు ఆర్డర్ కాపీలను అందజేశారు. పరీక్ష కేంద్రాల్లో ఏమైనా పొరపాట్లు జరిగితే ఆయా పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్ బాధ్యత వహించాల్సి ఉంటుందని కంట్రోలర్ డా కె ప్రవీణ తెలిపారు.
News November 22, 2025
MBNR:U-14 క్రికెట్.. 24న జట్ల ఎంపిక

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అండర్-14 బాలుర క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి (MDCA) రాజశేఖర్ ‘Way2News’తో తెలిపారు. ఈనెల 24న మహబూబ్ నగర్లోని క్రికెట్ స్టేడియంలో (పిల్లలమర్రి) ఎంపికలు ఉంటాయని, 1.9.2011 తర్వాత జన్మించిన వారు అర్హులని, ఆసక్తి గల క్రీడాకారులు బోనఫైడ్, ఆధార్, జనన ధ్రువీకరణ పత్రం, ఫొటోలతో హాజరు కావాలన్నారు.
#SHARE IT.


