News January 16, 2025

ఉమ్మడి జిల్లాల్లో నేటి..TOP NEWS.!

image

✔పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం✔GDWL:పట్టుచీర ఆకారంలో సంక్రాంతి ముగ్గు✔Way2Newsతో ముచ్చటైన ముగ్గురు✔కల్వకుర్తి:రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి✔NGKL:ఘనంగా బండలాగుడు పోటీలు✔ప్రారంభమైన ఉమామహేశ్వరుడి బ్రహ్మోత్సవాలు✔వీపనగండ్ల:పాము కాటుతో అత్త,కోడలు మృతి✔MBNR:’CRICKET జట్టు తమిళనాడు ప్రయాణం’✔26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ✔సంక్రాంతి సంబరాల్లో స్థానిక ఎమ్మెల్యేలు

Similar News

News January 16, 2025

వనపర్తి: పాముకాటుతో అత్తాకోడళ్ల మృతి

image

పాముకాటుతో అత్తాకోడళ్లు మృతిచెందారు. ఈ ఘటన వరపర్తి జిల్లా వీపనగండ్లలోని వల్లభాపురంలో జరిగింది. స్థానికుల ప్రకారం.. ఈనెల 6న అత్త కిష్టమ్మ(75)ను ఎడమ చేతిపై పాము కాటేయడంతో మరణించింది. కాగా, ఈనెల 12న కోడలు ఎల్లమ్మ(52) ఇంటి అరుగుపై పడుకొని ఉంది. ఈక్రమంలో నాగుపాము ఆమె కాలిపై కాటేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News January 16, 2025

MBNR: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు ఎన్నంటే?

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే అన్ని జిల్లాల్లో దాదాపుగా పూర్తయినట్లేనని అధికారులు అంటున్నారు. ప్రజాపాలనలో MBNR-2,09,514, NGKL-2,33,124, GWL-1,46,832, NRPT-1,48,780, WNP-1,42,075 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటికే గ్రామాల్లో కార్యదర్శి ఇంటింటికీ సర్వే చేసి వివరాలను యాప్‌లో నమోదు చేశారు. కొందరి వివరాలు నమోదు కాకపోవడంతో సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

News January 15, 2025

MBNR: ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు.!

image

ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. ఏప్రిల్‌ 29 నుంచి జూన్‌ 19 వరకు ఎంట్రన్స్‌ టెస్ట్‌లు నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది.❤️ఏప్రిల్‌ 29 నుంచి ఈఏపీసెట్‌.❤️ఏప్రిల్ 29, 30న ఈఏపీసెట్ అగ్రికల్చర్‌, ఫార్మసీ.❤️మే 2 నుంచి 5 వరకు ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌.❤️మే 12న ఈసెట్, జూన్ 1న ఎడ్‌సెట్‌.❤️జూన్ 6న లాసెట్, పీజీఎల్ సెట్, 8,9 తేదీల్లో ఐసెట్‌.❤️జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్ పరీక్షలు.