News January 16, 2025

ఉమ్మడి జిల్లాల్లో నేటి..TOP NEWS.!

image

✔పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం✔GDWL:పట్టుచీర ఆకారంలో సంక్రాంతి ముగ్గు✔Way2Newsతో ముచ్చటైన ముగ్గురు✔కల్వకుర్తి:రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి✔NGKL:ఘనంగా బండలాగుడు పోటీలు✔ప్రారంభమైన ఉమామహేశ్వరుడి బ్రహ్మోత్సవాలు✔వీపనగండ్ల:పాము కాటుతో అత్త,కోడలు మృతి✔MBNR:’CRICKET జట్టు తమిళనాడు ప్రయాణం’✔26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ✔సంక్రాంతి సంబరాల్లో స్థానిక ఎమ్మెల్యేలు

Similar News

News February 18, 2025

అడ్డాకుల: డ్రోన్ తగిలి గాయాలపాలైన యువ రైతు.!

image

వరి పంటకు మందు స్ప్రే చేసే డ్రోన్ తగిలి ఓ రైతు గాయాలపాలైన ఘటన అడ్డాకుల మండలం రాచాల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే రాచాల గ్రామానికి చెందిన రైతు దండు ఆంజనేయులు వరి పంట సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో పంటకు మందు స్ప్రే చేయడానికి డ్రోన్ వాడుతున్న నేపథ్యంలో ప్రమాదవశాత్తు డ్రోన్ తగిలి తలకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

News February 18, 2025

NRPT: గల్లంతైన తండ్రీకొడుకులు మృతి

image

బావిలో పడి <<15494116>>గల్లంతైన తండ్రీకొడుకులు<<>> మృతిచెందిన ఘటన దామరగిద్ద మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. తన భార్య గ్రామమైన మండల పరిధిలోని మద్దెలబీడులో కర్ణాటకకు చెందిన శివయ్య(35) కుటుంబంతో ఉంటున్నారు. తన కుమారుడు(5) ప్రమాదవశాత్తుబావిలో పడిపోగా.. కాపాడటానికి వెళ్లి తను కూడా మునిగిపోయారు. వారిని సహాయక సిబ్బంది గాలించి మృతదేహాలను వెలికితీశారు. తండ్రీకుమారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. 

News February 18, 2025

MBNR: బయోమెట్రిక్ లేకపోతే కఠిన చర్యలు: కలెక్టర్

image

జిల్లా కలెక్టరేట్లోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది బయోమెట్రిక్ పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి హెచ్చరించారు. సోమవారం తన ఛాంబర్ లో బయోమెట్రిక్ విధానం పై సమీక్ష నిర్వహించారు. ప్రతి ఒక్కరు బయోమెట్రిక్ ను పాటించాల్సిందేనని, అలా కాకుండా గైర్హాజర్ అయితే వారిని సహించేది లేదని ఘాటుగా హెచ్చరించారు. అన్ని శాఖల అధికారులు బయోమెట్రిక్‌పై ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు.

error: Content is protected !!