News January 28, 2025
ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా: ఖానాపూర్ ఎమ్మెల్యే

ఉమ్మడి జిల్లాకు అత్యధికంగా నిధులను మంజూరు చేయించి అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. సోమవారం సిరికొండ మండలంలోని వాయిపెట్ గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న వాలీబాల్ పోటీలను తిలకించి, ఆటను ఆడారు. మాజీ ఎంపీ సోయం బాపురావు ఉన్నారు.
Similar News
News January 6, 2026
ADB: 11 మంది టీజీఎస్పీ సిబ్బంది కన్వర్షన్

విధుల నిర్వహణను అంకితభావంతో, క్రమశిక్షణతో చేపట్టాలని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. టీజీఎస్పీ (తెలంగాణ స్పెషల్ పోలీస్) నుంచి వివిధ బెటాలియన్ల పరిధిలో విధులు నిర్వర్తించి ఆదిలాబాద్ జిల్లా సాయుధ విభాగానికి 11 మంది మంగళవారం బదిలీ అయ్యారు. విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఎస్పీ సూచించారు. RI వెంకటి, సీసీ కొండరాజు పాల్గొన్నారు.
News January 6, 2026
ఆదిలాబాద్: రూ.50 పెరిగిన పత్తి ధర

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో మంగళవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,010గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,400గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. ప్రైవేట్ ధర రూ.50 పెరిగినట్లు వెల్లడించారు.
News January 6, 2026
ఆదిలాబాద్: విద్యుత్ వినియోగదారులకు టోల్ ఫ్రీ

విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించే క్రమంలో 1912 టోల్ ఫ్రీ సేవలను వినియోగించుకోవాలని ఆదిలాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ శేషారావు పేర్కొన్నారు. 16 సర్కిళ్ల విద్యుత్ వినియోగదారులు ఈ టోల్ ఫ్రీ సేవలను సద్వినియోగ పరుచుకోవాలని పేర్కొన్నారు. 1912కు ఫోన్ చేయగానే ఫిర్యాదును స్వీకరించి, నమోదు చేసి సమాచారాన్ని సంబంధిత అధికారికి వెళ్తుందన్నారు.


