News December 23, 2024

ఉమ్మడి జిల్లా జడ్పీటీసీల ఆత్మీయ సమావేశం

image

విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పీటీసీలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మునగపాక మండలం వెంకటాపురంలో ఈ ఆత్మీయ కలయిక జరిగింది. ఈ కార్యక్రమంలో బుచ్చియపేట జడ్పీటీసీ, జిల్లా జడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు దొండా రాంబాబు, సీనియర్ జడ్పీటీసీ కర్రి సత్యం పాల్గొన్నారు. జడ్పీటీసీల ఫ్లోర్ లీడర్‌గా పరవాడ జడ్పీటీసీ పైలా సన్యాసి రాజును ఎన్నుకున్నామని రాంబాబు తెలిపారు.

Similar News

News December 23, 2024

విశాఖ: ‘అభివృద్ధి పథకాలపై జిల్లాల వారీగా సమీక్ష’

image

ఉపాధి హామీ పథకం, అమృత్ పథకం, పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన తదితర అభివృద్ధి పథకాలపై జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ 20 సూత్రాల ఛైర్మన్ ఎల్.దినకర్ తెలిపారు. సోమవారం విశాఖ బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సమీక్ష సమావేశాల అనంతరం నివేదికలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పిస్తామన్నారు. ఈ సమావేశంలో విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మేడపాటి రవీందర్ పాల్గొన్నారు.

News December 23, 2024

కేజీహెచ్‌లో ఓపీ కౌంటర్ వద్ద పనిచేయని సర్వర్లు..!

image

విశాఖ కేజీహెచ్‌లో సర్వర్లు పని చేయక రోగులు కష్టాలు పడుతున్నారు. తెల్లవారి నుంచి ఓపి కౌంటర్ దగ్గర గంటల తరబడి లైన్‌లో నిల్చొని ఇబ్బందులు పడుతున్నారు. టోకెన్లకే సమయం అయిపోతుందని రోగులు ఆందోళన చెందుతున్నారు. ఓపి కౌంటర్ వద్ద ప్రతిరోజు రోగులకు కష్టాలు తప్పడం లేదని.. ప్రత్యమ్నాయం చేపట్టాలని రోగుల బంధువులు కోరుతున్నారు.

News December 23, 2024

భీమిలి తీరానికి కొట్టుకొచ్చిన తాబేళ్ల కళేబరాలు

image

భీమిలి మండలం తిమ్మాపురం సముద్ర తీర ప్రాంతానికి రెండు తాబేళ్ల కళేబరాలు ఆదివారం కొట్టుకొచ్చాయి. రెండు రోజులుగా భీమిలి, ఉప్పాడ, మంగమూరిపేట తదితర తీర ప్రాంతాలకు తాబేళ్ల కళేబరాలు కొట్టుకొస్తున్నట్లు స్థానిక మత్స్యకారులు తెలిపారు. ఈ సీజన్‌లో గుడ్లు పెట్టేందుకు తీరానికి వస్తుంటాయని వారు వెల్లడించారు. కాలుష్యం కారణంగా ఇవి మృత్యువాత పడుతున్నట్లు భావిస్తున్నారు.