News September 14, 2024
ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రత వివరాలు ఇలా

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లా మాగనూరులో 32.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా జాలాపూర్ 31.5 డిగ్రీలు, వనపర్తి జిల్లా వీపంగండ్లలో 30.7 డిగ్రీలు, మహబూబ్‌నగర్ జిల్లా సిరివెంకటపూర్ లో 30.3 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా వాత్త్వర్లపల్లిలో 28.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతల నమోదు అయ్యాయి.
Similar News
News March 11, 2025
MBNR: మూడా సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మూడా కార్యాలయంలో మూడా సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి, జనంపల్లి అనిరుధ్ రెడ్డి, పర్ణిక రెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి సోమవారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముడా అధికారులపై పలు అంశాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
News March 10, 2025
MBNR: చెక్‌డ్యామ్‌లో పడి గొర్రెల కాపరి మృతి

చిన్నచింతకుంట మండలంలో చెక్‌డ్యామ్‌లో పడి గొర్రెల కాపరి మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. కౌకుంట్ల మం. అప్పంపల్లికి చెందిన మహేశ్(25) తనకున్న గొర్రెలను స్నానం చేయించేందుకు అప్పంపల్లి-ఏదులాపురం మధ్యలో ఉన్న వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం సమీపంలోని నీటి గుంతకు తీసుకొచ్చాడు. గొర్రెలకు స్నానం చేయిస్తుండగా కాలుజారి గుంతలో పడి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
News March 10, 2025
MBNR: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

రాజాపూర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. జడ్చర్లకు చెందిన ఓరుగంటి సత్యనారాయణశర్మ(71) తన స్కూటీపై ముదిరెడ్డిపల్లిలో ఓ ఇంట్లో పూజ చేయించేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలోకి వెళ్లేందుకు టర్న్ తీసుకుంటుండగా ఓ బైక్ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.