News September 30, 2024
ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రత వివరాలిలా

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా సోమవారం ఈ క్రింది విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా కొత్తపల్లిలో 35.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా చిన్నతండ్రపాడులో 35.4 డిగ్రీలు, నారాయణపేట జిల్లా గుండుమల్లో 33.2 డిగ్రీలు, వనపర్తి జిల్లా గణపూర్లో 32.7 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా పద్రాలో 31.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News December 2, 2025
మహబూబ్నగర్: జిల్లా ఇన్స్పెక్షన్ ప్యానెల్కు దరఖాస్తుల ఆహ్వానం

మహబూబ్నగర్ జిల్లాలోని అర్హత కలిగిన ఉపాధ్యాయులు, హెడ్మాస్టర్ల నుంచి జిల్లా ఇన్స్పెక్షన్ ప్యానెల్ (District Inspection Panel) ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి (DEO) ఏ.ప్రవీణ్ కుమార్ తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు, ఆసక్తి గలవారు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను డిసెంబర్ 4, 2025 లోపు సమర్పించాలని ఆయన ఆదేశించారు.
News December 2, 2025
పాలమూరు: ఎన్నికల నిబంధనలను తప్పకుండా పాటించాలి

సర్పంచ్, వార్డ్ మెంబర్స్, ఓటర్లు ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు తమ పోలీస్ అధికారులకు సహకరించాలని ఎస్పీ జానకి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి సమస్యలు వచ్చిన తమ పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 2, 2025
రేపటి నుంచి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

దేవరకద్ర మండలం చిన్నరాజమూర్ గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో మంగళవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని ఈవో శ్యాంసుందర్ సోమవారం తెలిపారు. దాదాపు 5 రోజులు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎక్కడ భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసేలా తగు చర్యలు తీసుకున్నామన్నారు. డిసెంబర్ 6వ తేదీన బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు.


