News July 29, 2024
ఉమ్మడి జిల్లా నేటి టాప్ న్యూస్
✓ శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి నీటి విడుదల.
✓ జూరాల 46 గేట్లు ఎత్తి నీటి విడుదల.
✓రేపు రెండో విడత రుణమాఫీ: నాగర్ కర్నూల్ కలెక్టర్.
✓ ఉమ్మడి జిల్లాలో ముగిసిన కౌడి పీర్ల ఉత్సవాలు.
✓ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సినారే జయంతి వేడుకలు.
✓ అచ్చంపేట: ఘనంగా అంతర్జాతీయ పులుల దినోత్సవం.
✓ రాజోలి: సుంకేసులకు పోటెత్తిన వరద.
✓ వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్ పై సీఎంతో రైల్వే శాఖ అధికారుల చర్చలు.
Similar News
News November 29, 2024
బాలానగర్ సీతాఫలం భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేయండి: SKLTSHU
బాలానగర్ మండల సీతాఫలం భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేయాలని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఈ మండలంలో పుట్టిన సీతాఫలం ఇతర జిల్లాల్లో విస్తరించింది. ఈ చెట్టుకు అందమైన ఆకులు, గుండ్రని ఆకారంలో రుచికరమైన పండ్లు ఉంటాయి. ఈ సీతాఫలాలు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. బాలానగర్ సీతాఫలానికి భౌగోళిక గుర్తింపు వస్తే ఈ రకానికి చట్టబద్ధత రక్షణ కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
News November 29, 2024
వణికిస్తోన్న చలి.. కోస్గిలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చలి విపరీతంగా పెరిగింది. 5 రోజుల క్రితమే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గినట్లు HYD వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు చలి గాలులు వీస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అత్యల్పంగా కోస్గి, ఎల్లికల్‌లో 12.9 ఉష్ణోగ్రత నమోదయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12.9నుంచి 18.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
News November 29, 2024
MBNR: ఆస్పత్రిలో బాలింత మృతి.. నర్సులపై వేటు
మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో<<14731958>> బాలింత మృతి<<>> ఘటనలో ఇద్దరు నర్సులను వైద్యాధికారి సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గండీడ్ మం. ఆసిరెడ్డిపల్లికి చెందిన రజిత కాన్పుకోసం బుధవారం ఆస్పత్రిలో చేరారు. రాత్రి బిడ్డకు జన్మనించిన ఆమె.. గురువారం ఉదయం చనిపోయారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. న్యాయం చేస్తామన్న హామీతో ఆందోళన విరమించారు.