News June 28, 2024
‘ఉమ్మడి జిల్లా నేటి ముఖ్యాంశాలు”

√కొడంగల్ అభివృద్ధిపై NRPT,VKB జిల్లా కలెక్టర్ల సమీక్ష.
√ SDNR:భారీ పేలుడు.. ముగ్గురు మృతి.
√ACPT:మాజీ మంత్రి హరీష్ రావుకు అచ్చంపేట MLA సవాల్.
√NGKL:ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: మంత్రి జూపల్లి.
√MBNR:ప్రణాళిక బద్ధంగా చదివితే విజయం మీదే: పీయూ OSD.
√NGKL: భర్తను చంపిన భార్య.
√ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా EX.PM పీవీ నరసింహారావు జయంతి వేడుకలు.
√SDNR:పేలుడు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా.
Similar News
News November 30, 2025
ALERT: ప్రజావాణి రద్దు: కలెక్టర్

మహబూబ్ నగర్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి వినతులను స్వీకరించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం రద్దయిన విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని సూచించారు.
News November 30, 2025
MBNR: నామినేషన్ కేంద్రాలను సందర్శించిన ఎస్పీ

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్ఠం చేసేందుకు భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ డి.జానకి కోయిలకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండో విడత నామినేషన్ కేంద్రాలైన కోయిలకొండ, సంగినోని పల్లి, ఎల్లారెడ్డిపల్లి, మోదీపూర్, శేరివెంకటపూర్, సూరారం, ఖాజీపూర్ గ్రామాలను వరుసగా సందర్శించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని ఆదేశించారు. ఎస్సై తిరుపాజి పాల్గొన్నారు.
News November 30, 2025
ఉమ్మడి MBNR జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత

మహబూబ్నగర్ జిల్లాలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో గండీడ్ మండలం సల్కర్పేటలో 15.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్లో 15.9 డిగ్రీలు, బాలానగర్లో 16.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చలి కారణంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడ్డారు.


