News September 26, 2024
ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. నాగర్ కర్నూల్ జిల్లా ఎళ్లికలో 48.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా మాచుపల్లిలో 41.3 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా సోలిపూర్ లో 33.0 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా ఉట్కూరులో 20.5 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా కేంద్రంలో 14.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
Similar News
News January 3, 2026
జడ్చర్ల: అనుమానాస్పదంగా బాలిక మృతి

జడ్చర్ల మండలం కిష్టారం గ్రామానికి చెందిన పిట్టల మల్లయ్య కుమార్తె రాజేశ్వరి(17) ఇంటిలో అనుమానాస్పదంగా ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించిగా మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాదేపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News January 3, 2026
సావిత్రిబాయి ఫూలే సేవలు చిరస్మరణీయం: వీసీ

మహిళా విద్య, సామాజిక సమానత్వం కోసం సావిత్రిబాయి ఫూలే చేసిన సేవలు ఆదర్శప్రాయమని పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొ. జిఎన్ శ్రీనివాస్ అన్నారు. శనివారం వర్సిటీలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్యవక్తగా న్యాయవాది జనార్దన్ పాల్గొని ప్రసంగించగా, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డా. ప్రవీణ అధ్యక్షత వహించారు.
News January 3, 2026
మహబూబ్‌నగర్: నేషనల్ కబడ్డీ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక

విజయవాడలో ఈనెల 15 నుంచి 18 వరకు జరిగే జూనియర్ నేషనల్ కబడ్డీ పోటీలకు జిల్లాకు చెందిన పాండు నాయక్, హేమంత్ యాదవ్ ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన సెలక్షన్స్‌లో వీరు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. క్రీడాకారుల ఎంపికపై జిల్లా అసోసియేషన్ హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర అసోసియేషన్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.


