News September 27, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా గద్వాల జిల్లా మల్దకల్లో 13.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా కోస్గిలో 12.8 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా హన్వాడలో 12.8 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా మదనపూర్ లో 4.0 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూలు జిల్లా బొల్లంపల్లిలో 3.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

Similar News

News October 5, 2024

కల్వకుర్తి: సూర్య ప్రకాశ్ రావును అభినందించిన కేటీఆర్

image

కల్వకుర్తి పట్టణ సమీపంలోని సూర్యలత స్పిన్నింగ్ మిల్లులో ఇటీవల జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన సూర్య ప్రకాశ్ రావును మాజీ మంత్రి కేటీఆర్ శనివారం అభినందించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి వారు కేటీఆర్‌ను కలిశారు.

News October 5, 2024

కొడంగల్: DSC ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 5వ, జిల్లాస్థాయిలో 3వ ర్యాంక్

image

కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలోని గుండ్లకుంటకు చెందిన తిరుమలేశ్ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ విభాగంలో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు జిల్లాస్థాయిలో 3వ ర్యాంకు సాధించి ఔరా అనిపించుకున్నాడు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.

News October 5, 2024

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేటి వర్షపాతం వివరాలవే

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా గద్వాల జిల్లా కల్లూరు తిమ్మన్న దొడ్డిలో 49.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 43.5 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా వెలుగొండలో 35.5 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా ధన్వాడలో 33.0 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో 17.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.