News October 15, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాతం వివరాలు ఇలా…

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా చిన్నపురవపల్లి లో 13.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా కేతపల్లిలో 2.5 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా అలంపూర్ లో 1.3 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా మాగనూరులో 0.5 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా సల్కర్పేటలో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

Similar News

News November 18, 2025

MBNR: వాలీబాల్ ఎంపికలు.. 500 మంది హాజరు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో వాలీబాల్ ఎంపికలు నిర్వహించారు. డీఈవో ప్రవీణ్ కుమార్, స్టేట్ ఎస్జీఎఫ్ సెక్రటరీ ఉషారాణి, జడ్చర్ల ఎంఈఓ మంజులా దేవి, SGF జిల్లా సెక్రటరీ డాక్టర్ ఆర్.శారదాబాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొత్తం 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పీడీలు వేణుగోపాల్, రామచందర్, రాములు, ముస్తఫా, కృష్ణ, మోహిన్, రవికుమార్ గౌడ్, శంకర్ పాల్గొన్నారు.

News November 18, 2025

MBNR: వేతనాలు అకౌంట్లో జమ:వీసీ

image

పాలమూరు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి యూనివర్సిటీ వీసీ జిఎన్ శ్రీనివాస్ గుడ్ న్యూస్ తెలిపారు. ఇవాళ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత 3,4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి ఐఎఫ్ఎమ్ఎస్, పిఎఫ్ఎంఎస్ ద్వారా వేతనాలను జరుగుతుందన్నారు. వేతనాలు వారి అకౌంట్లో జమ అయ్యే విధంగా ప్రయత్నించినారని తెలిపారు.

News November 18, 2025

జడ్చర్ల: అగ్ని ప్రమాదం.. మృతుల వివరాలు ఇవే

image

జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని సలార్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.. వారి వివరాలు పప్పు (ఒడిశా) హరేందర్( బిహార్) అనే ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పప్పున్, సాతి మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.