News April 19, 2024
ఉమ్మడి జిల్లా నేటి TOP NEWS
√MBNR: వంశీచందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన సీఎం.
√NGKL:BRS అభ్యర్థిగా RSP నామినేషన్ దాఖలు.
√ పాలమూరుకు పట్టిన దరిద్రమే కాంగ్రెస్ పార్టీ:మాజీమంత్రి. √MBNR:కారు ఇక షెడ్డుకే: సీఎం రేవంత్ రెడ్డి.
√NRPT:తనను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు: డీకే అరుణ.
√ 2వ రోజు MBNR..6,NGKL..3 నామినేషన్లు దాఖలు.
√ బిజినేపల్లి: అసభ్య ప్రవర్తన టీచర్ సస్పెండ్.
Similar News
News December 25, 2024
ఉప రాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికిన మంత్రి జూపల్లి
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ దంపతులు మెదక్ జిల్లా పర్యటనకు వెళ్తున్న సందర్భంగా ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ దంపతులకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పూల బోకే అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.
News December 25, 2024
MBNR: BJP కొత్త సారథులు ఎవరు?
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో BJPని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం దృష్టిసారించింది. JANలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు కొత్త సారథులను నియమించనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ BJPని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. మరి MBNR, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్కర్నూల్, నారాయణపేట జిల్లాలకు నూతన అధ్యక్షులు ఎవరు అవుతారో వేచి చూడాలి.
News December 25, 2024
MBNR: మెదలైన ఎన్నికల సందడి.. యువత ఓటు ఎటు?
ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఈసారి జరిగే స్థానిక సంస్థల ఎలక్షన్లలో యువత ఓటును ఆకర్షించడానికి నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ సారి యువత ఓటు అధిక సంఖ్యలో నమోదు కావడంతో స్థానిక నాయకులలో భయం మొదలైంది. యువత మాత్రం అభివృద్ధి వైపే ఓటు వేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓటర్లను ప్రలోభ పెట్టేలా నాయకులు ప్రవర్తిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.