News April 28, 2024
ఉమ్మడి జిల్లా పోలీస్ పరిశీలకుడిని కలిసిన ఎస్పీ సింధూ శర్మ

కామారెడ్డి జిల్లాకు ఆదివారం వచ్చిన జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంటు నియోజక వర్గ పోలీస్ పరిశీలకుడు రాజేష్ మీనాను జిల్లా ఎస్పీ సింధు శర్మ మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలు కాపాడడానికి, ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడానికి పటిష్ట పోలీస్ భద్రత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయనకు వివరించారు.
Similar News
News November 28, 2025
NZB: పోలీసు సిబ్బందికి ఉలన్ బ్లాంకెట్స్, టీ షర్ట్స్ అందజేత

చలికాలంలో విధుల నిర్వహణ కష్టమవుతోందని ముందు జాగ్రత్తగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్లోని ఏఆర్, సివిల్ పోలీస్ సిబ్బందికి ఉలెన్ బ్లాంకెట్స్, టీ షర్ట్స్ అందజేశారు. చలికాలంలో ప్రతి ఒక్కరూ ఉలెన్ బ్లాంకెట్స్ సద్వినియోగం చేసుకోవాలని, విధి నిర్వహణలో క్యారీ చేసి ఉపయోగించుకోవాలని సీపీ సూచించారు.
News November 28, 2025
నిజామాబాద్: నామినేషన్ అభ్యర్థలకు కొత్త బ్యాంక్ అకౌంట్ కష్టాలు

గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచి, వార్డు సభ్యులు నామినేషన్ పత్రాలతో జీరో అకౌంట్ బ్యాంక్ ఖాతాను జతచేయాలని అధికారులు నిబంధనలు జారీ చేశారు. ఈ సమాచారం తెలియని అభ్యర్థులు నామినేషన్ దాఖలుకు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. కాగా అభ్యర్ధులకు జీరో అకౌంట్ ఖాతాలు ఇవ్వాలని బ్యాంకు అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. కొత్త నిబంధన వల్ల అభ్యర్ధులు బ్యాంక్‌లకు క్యూ కడుతున్నారు.
News November 28, 2025
NZB: GPఎన్నికలు.. సిబ్బందికి సీపీ సూచనలు

గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు పోలీసు సిబ్బందికి నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య సెట్ కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. ఎన్నికల భద్రత, శాంతి భద్రతా చర్యలు, పర్యవేక్షణకు సంబంధించిన సలహాలు ఇచ్చారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడడం ప్రజల భద్రత అని శాంతి భద్రతల పరిరక్షణ పోలీస్ బాధ్యత అని పేర్కొన్నారు.


