News September 1, 2024
‘ఉమ్మడి జిల్లా ప్రజలకు ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరం’
తుఫాను ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు నరకయాతన పడుతున్నారని ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. మేమున్నాం మీకేం కాదనే ధైర్యాన్ని వారికి ఇవ్వాలని అధికారులను, నాయకులను కోరారు. ప్రజలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను అధికారులతో కలిసి సమన్వయం చేయాలని సూచించారు. జిల్లాలో వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.
Similar News
News September 21, 2024
నష్టపరిహారం అందని వరద బాధితులకు ప్రత్యేక కౌంటర్లు: కమిషనర్
ఖమ్మం మున్నేరు వరద ముంపునకు గురై నష్ట పరిహారం అందని వరద బాధితుల వివరాల సేకరణ కోసం ప్రతి డివిజన్ నందు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. ఈ ప్రత్యేక కౌంటర్లను రేపటి నుంచి అన్ని డివిజన్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. కావున వరద బాధితులు ఈ విషయాన్ని గమనించి తమ వివరాలు, బ్యాంక్ అకౌంట్ నంబర్లను అధికారులకు అందజేయాలని పేర్కొన్నారు.
News September 21, 2024
ఎస్ఎల్బీసీ పూర్తికి నెలవారీగా నిధులు కేటాయిస్తాం: భట్టి
శ్రీశైలం ఎడమ కాలువ సొరంగ మార్గం (SLBC) ప్రాజెక్టును శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. అనంతరం అధికారులతో భట్టి సమీక్షించారు. ఎస్ఎల్బీసీ పూర్తికి నెలవారీగా నిధులు కేటాయిస్తామని చెప్పారు. అటు నెలకు 400 మీటర్లు చొప్పున సొరంగం తవ్వితే 14 కోట్లు నిధులు అవసరమవుతాయని, 20 నెలల్లో ప్రాజెక్టు పూర్తికి అవకాశం ఉందని చెప్పారు. రాబోయే రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
News September 20, 2024
మిషన్ భగీరథలో భారీ అవినీతి జరిగింది: మంత్రి పొంగులేటి
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ పేరుతో భారీ అవినీతి జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. భగీరథలో జరిగిన అవినీతి గురించి ప్రజలకు తేలియాజేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో 53 శాతం మంది ప్రజలకు మంచినీరు అందలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అందరికి మంచినీరు అందిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.