News March 21, 2025

ఉమ్మడి జిల్లా ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 13కు వాయిదా

image

2025-2026 విద్యా సంవత్సరంలో ఉమ్మడి జిల్లా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కళాశాలల 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 13వ తేదీకి వాయిదా వేసినట్లు ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ ఐ.శ్రీదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష తేదీలు ఏప్రిల్ 13న 5వ తరగతికి ఉదయం 9-12 గంటల వరకు, ఇంటర్మీడియట్ మధ్యాహ్నం 2 -4:30 గంటల వరకు ఉంటాయని పేర్కొన్నారు.

Similar News

News March 29, 2025

నందవరం మండల నాయకుడికి వైసీపీ కీలక పదవి

image

వైసీపీ రాష్ట్ర రైతు విభాగం అధికార ప్రతినిధిగా నందవరం మండలం హాలహర్వికి చెందిన గడ్డం లక్ష్మీనారాయణ రెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. దీంతో పార్టీ శ్రేణులు ఆయనను శుక్రవారం ఎమ్మిగనూరు పార్టీ కార్యాలయంలో సత్కరించారు. లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఏ ఒక్క హామీనీ నెరవేర్చకుండా మోసం చేసిందని మండిపడ్డారు.

News March 29, 2025

సమాజంలో పేదలకు అండగా ఉండేందుకు పీ-4 లక్ష్యం: కలెక్టర్

image

సమాజంలో పేదలకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీ 4 విధానాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ పీ.రంజిత్ బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో పేదరిక నిర్మూలనకు P4 (ప్రభుత్వ, దాతల, ప్రజల భాగస్వామ్యం) విధానంపై స్టేక్ హోల్డర్లు, తదితరులతో కలెక్టర్ చర్చించారు. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న 10 శాతం మంది అత్యంత పేదరికంలో ఉన్న 20 శాతం మందికి చేయూతనివ్వడమే లక్ష్యమన్నారు.

News March 28, 2025

దేవనకొండ: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

దేవనకొండ మండలం తెర్నెకల్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గిరిపోగు ప్రతాప్(27) శుక్రవారం సాయంత్రం గ్రామసభ షామియానా తీసే సమయంలో పైన ఉన్న కరెంట్ తీగలు తగిలి షాక్ కొట్టింది. వెంటనే అక్కడే ఉన్న వారు దేవనకొండ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

error: Content is protected !!