News September 14, 2024

ఉమ్మడి తూ.గో. జడ్పీ ఇన్‌ఛార్జి CEOగా పాఠంశెట్టి

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ ఇన్‌ఛార్జి సీఈవోగా పాఠంశెట్టి నారాయణ మూర్తి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈయన కాకినాడ డివిజన్ డీఎల్డీవో విధులు నిర్వర్తిస్తున్నారు. సీఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇంతవరకు ఇక్కడ సీఈవోగా పనిచేసిన ఎ.శ్రీరామచంద్రమూర్తి రిలీవ్ అయిన విషయం తెలిసిందే.

Similar News

News October 5, 2024

తునిలో కిలో టమాటాలు రూ.100

image

ఎన్నడూ లేని విధంగా కూరగాయల ధరలు కొండెక్కి కూర్చోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నామన్నారు. శనివారం తుని మార్కెట్లో కిలో టమాటాలు రేటు వందకు చేరువలో ఉంది. ఉల్లిపాయలు రూ.50, బీరకాయ రూ.60, చిక్కుడుకాయ రూ .100, క్యాప్సికం రూ.90, మిర్చి రూ.40, అనపకాయలు రూ.30, బోబ్బురి చిక్కుళ్లు రూ.60 పలుకుతున్నట్లు వ్యాపారస్థులు చెబుతున్నారు.

News October 5, 2024

రాజమండ్రి: రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ యువతి మృతి

image

నిడదవోలుకు చెందిన దీప్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. పోలీసుల కథనం..సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతోంది. ఫ్రెండ్స్‌తో రాజమండ్రి చూసి వస్తానని శుక్రవారం ఇంట్లో చెప్పి వచ్చింది. 9 మంది 4 బైకులపై బయలుదేరారు. కోరుకొండ నారసింహున్ని దర్శించుకుని వస్తూ.. బూరుగుపూడి జంక్షన్ వద్ద బైకు నడుపుతున్న దీప్తి, టాటా ఏసీని ఢీకొట్టి ప్రాణాలు విడిచింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News October 5, 2024

తూ.గో.జిల్లాలో 125మద్యం దుకాణాలకు నోటిఫికేషన్

image

తూర్పు గోదావరి జిల్లాలోని ఏడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 125 మద్యం దుకాణాలకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశామని ఎక్సైజ్ జిల్లా అధికారి లావణ్య శుక్రవారం తెలిపారు. కొవ్వూరు మున్సిపాలిటీలో మూడు, మండలంలో 5, నిడదవోలు పురపాలక సంఘంలో నాలుగు, మండలంలో 5, చాగల్లు మండలంలో నాలుగు, తాళ్లపూడి మండలంలో నాలుగు, నల్లజర్లలో ఆరు దుకాణాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఆన్ లైన్‌లో దరఖాస్తు చేయవచ్చన్నారు.