News July 20, 2024

ఉమ్మడి తూ.గో జిల్లాకు కొత్త JCల నియామకం

image

ఏపీలో 62 మంది ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. తూ.గో జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హిమాన్షు కౌశిక్ రానున్నారు. అంబేడ్కర్ కోనసీమ జాయింట్ కలెక్టర్‌గా నిశాంతి నియమితులు కాగా.. ప్రస్తుతం అక్కడ జేసీగా ఉన్న నుపూర్ అజయ్ బదిలీ అయ్యారు. కాకినాడ జాయింట్ కలెక్టర్‌గా ఆర్.గోవిందరావు బదిలీపై రానున్నారు. రాజమండ్రి మున్సిపల్ కమిషనర్‌గా కేతన్ గార్గ్ నియమితులయ్యారు.

Similar News

News October 12, 2024

కాకినాడ జిల్లాలో రావణ దేవాలయాన్ని చూశారా..!

image

లంకాధిపతి రావణాసురుడి దేవాలయం మన కాకినాడ రూరల్ సాగర తీరాన ఉంది. దసరా వేళ పలు ప్రాంతాల్లో రావణ దిష్టిబొమ్మను దహనం చేస్తుంటే, మరికొన్ని ప్రాంతాల్లో రావణాసురుని పూజించటం మరో విశేషం. దీన్ని కుంభాభిషేకం గుడి అని కూడా పిలుస్తారు. ఆయన ఆది కుంభేశ్వరుడిగా ఇక్కడ పూజలు అందుకుంటారు.

News October 12, 2024

రాజమండ్రి: దసరా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల

image

రాష్ట్ర ప్రజలకు మంత్రి కందులు దుర్గేష్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన రాజమహేంద్రవరంలోని క్యాంప్ కార్యాలయం నుంచి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చెడుపై చివరికి మంచే గెలుస్తుందని గుర్తుచేసే రోజు విజయదశమి అని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుతున్నట్లు ఆయన తెలిపారు.

News October 11, 2024

రాజమండ్రి: ప్రజలకు దశమి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రశాంతి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ నుంచి శుక్రవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని నవరాత్రుల సందర్భంగా ప్రతి ఇంట అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తూ దసరా వేడుకలను జరుపుకుంటామని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు.