News June 4, 2024
ఉమ్మడి తూ.గో జిల్లాలో అత్యధిక మెజార్టీ ఈయనదే

ఉమ్మడి తూ.గో జిల్లాలోని 19 నియోజకవర్గాలనూ కూటమి ఉడ్చేసింది. టీడీపీ-13, జనసేన-5, బీజేపీ-1 స్థానంలో విజయకేతనం ఎగురవేశాయి. ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక మెజార్టీ కాకినాడ రూరల్ JSP అభ్యర్థి పంతం నానాజీ సాధించారు. పిఠాపురం నుంచి బరిలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు 70,279+ ఓట్ల మెజార్టీ రాగా.. నానాజీ 72,040+ ఓట్ల మెజార్టీతో పవన్ కంటే ముందంజలో ఉండటం గమనార్హం.
NOTE: మెజార్టీ కాస్త అటూ ఇటుగా మారొచ్చు.
Similar News
News November 21, 2025
తూ.గో. జిల్లాలో రేపటి నుంచి గ్రామసభలు: పీడీ

తూ.గో. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఈ నెల 22న గ్రామ సభలు నిర్వహించాలని డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.నాగ మహేశ్వర రావు ఆదేశించారు. పారదర్శకతను పెంచడం, ప్రభుత్వ సేవలను గ్రామ స్థాయిలోనే ప్రజలకు అందుబాటులోకి తేవడమే ఈ సభల ముఖ్యోద్దేశమని తెలిపారు. ప్రజలు తప్పక హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.
News November 21, 2025
రాజమండ్రి: ఆర్టీసీకి రూ.32 లక్షల ఆదాయం

కార్తీక మాసం నేపథ్యంలో ఆర్టీసీకి కాసుల పంట పండింది. కార్తీకం వేళ జిల్లాలో ఉన్న డిపోల నుంచి 36 బస్సులు నడపడం ద్వారా రూ.32 లక్షల ఆదాయం వచ్చిందని డీపీటీవో మూర్తి శుక్రవారం తెలిపారు. శబరిమలకు 8 బస్సులు, పంచారామాలకు 13 బస్సులు, ఏకాదశి రుద్రులు, నవ నందులు, శివ కేశవ దర్శిని, కోనసీమ స్పెషల్గా 15 బస్సులు నడిపామన్నారు. అయ్యప్ప భక్తుల కోసం, అలాగే ధనుర్మాసంలో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందన్నారు.
News November 21, 2025
తూ.గో: ‘రాజమౌళికి కాంగ్రెస్ అండగా ఉంటుంది’

సినీ దర్శకుడు రాజమౌళిపై కేసులు నమోదు చేయడం బీజేపీ అసహనానికి, సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ మండిపడ్డారు. హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపి కేసులు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజమౌళికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు రాజమండ్రిలో తెలిపారు. తక్షణమే ఈ అర్థరహితమైన ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.


