News December 30, 2024

ఉమ్మడి తూ.గో.జిల్లాలో నేడు పీజీఆర్ఎస్ కార్యక్రమం 

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నేడు కలెక్టరేట్‌లలో జరుగుతుందని కలెక్టర్ షణ్మోహన్, ప్రశాంతి, మహేశ్ కుమార్ తెలిపారు. ఆదివారం ఈ మేరకు ప్రకటనలు విడుదల చేశారు.‌ రేపు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1వరకు నిర్వహిస్తామన్నారు. జిల్లా అధికారులు అందరూ విధిగా హాజరుకావాలని కలెక్టర్లు ఆదేశించారు.

Similar News

News January 14, 2025

జగ్గన్నతోటలో భారీ బందోబస్త్: సీఐ

image

అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో ఈ నెల 15న నిర్వహించే ప్రభల తీర్థానికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 372 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని పి.గన్నవరం సీఐ భీమరాజు సోమవారం తెలిపారు. ఏడుగురు సీఐలు, 23 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, 32 మంది హెడ్ కానిస్టేబుల్స్, 230 మంది పోలీసులు, 80 మంది హోంగార్డులను నియమించామన్నారు. ఎస్ఐ చిరంజీవి పర్యవేక్షణలో మొబైల్ టీమ్ తీర్థంలో సంచరిస్తారన్నారు.

News January 13, 2025

పిఠాపురంలో 389 బైండోవర్ కేసులు

image

పిఠాపురం నియోజవర్గంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో 389 బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. పేకాట, కోడిపందేలు నిర్వహిస్తారన్న  సమాచారంతో రెండు కోళ్లు, రూ. 24 వేల నగదు స్వాధీన పరుచుకొని 14 మందిని అరెస్టు చేశామన్నారు. కోడిపందేలు జరిగే ప్రాంతాలను గుర్తించి 35 మంది స్థల యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

News January 13, 2025

తూ.గో: నేడు, రేపు రైళ్లు రద్దు

image

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సోమవారం, మంగళవారం ఏర్పాటు చేసిన కాకినాడ టౌన్-చర్లపల్లి, చర్లపల్లి- కాకినాడ టౌన్ మధ్య రాకపోకలు సాగించే రెండు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ఆదివారం ప్రకటించారు. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన ఈ రెండు రైళ్లకు తగిన ప్రయాణికులు లేకపోవడంతో వీటిని రద్దు చేస్తున్నట్లు తెలిపారు.