News August 31, 2024

ఉమ్మడి తూ.గో. జిల్లాలో వర్షాలు

image

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని, మత్స్యకారుల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

Similar News

News November 30, 2025

రాజమండ్రి: నేటి మాంసం ధరలు ఇలా!

image

వారాంతం కావడంతో మాంసాహార దుకాణాలు వినియోగదారులతో కళకళలాడుతున్నాయి. రాజమండ్రి మార్కెట్లో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 250, స్కిన్‌తో రూ. 230గా ఉంది. లైవ్ కోడి ధర రూ.140 నుంచి రూ.150 వరకు లభిస్తోంది. ఇక, కేజీ మటన్ ధర రూ. 900కు విక్రయిస్తున్నారు. ప్రాంతాలవారీగా ధరలలో స్వల్ప తేడాలున్నాయి. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News November 29, 2025

రాజమండ్రి: ‘సెలవుల్లోనూ.. విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు’

image

విద్యుత్ బిల్లులు వసూళ్ల కౌంటర్లు ఆదివారం కూడా పని చేస్తాయని APEPDCL సూపరింటెండింగ్ ఇంజినీర్ కె.తిలక్ కుమార్ తెలిపారు. రెవెన్యూ కార్యాలయాలతో పాటు APEPDCL సెక్షన్ ఆఫీస్ కలెక్షన్ కౌంటర్లు, A.T.P సెంటర్‌లలో కూడా బిల్లులు ఆదివారం చెల్లించవచ్చని తెలిపారు. జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు.

News November 29, 2025

రాజమండ్రి : ఈవీఎం గోడౌన్ పరిశీలించిన DRO

image

జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామ మూర్తి శనివారం రాజమండ్రిలో ఈవీఎంల గోడౌన్‌ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర,రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు చేపట్టే సాధారణ తనిఖీల్లో భాగంగా ఉదయం స్ట్రాంగ్ రూమ్ గోడౌన్‌ను సందర్శించినట్లు చెప్పారు. వివిధ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేసి, సంబంధిత రిజిస్టర్‌లలో సంతకాలు చేసినట్లు పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల్లో కెమెరాల పర్యవేక్షణ ఉందన్నారు.