News August 31, 2024
ఉమ్మడి తూ.గో. జిల్లాలో వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని, మత్స్యకారుల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
Similar News
News February 15, 2025
గుండెపోటు లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు: కలెక్టర్

కోవిడ్ మహమ్మారి పరిస్థితి తరువాత గుండెపోటు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని, వీటి ప్రభావం నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రభుత్వం ద్వారా అందచేస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె మాట్లాడారు. ప్రజల్లో గుండె జబ్బులు, వాటికి సంబంధించిన లక్షణాలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.
News February 14, 2025
రాజమండ్రి: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆకస్మికంగా తనిఖీ

తూ.గో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి సత్వర వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం రాజమండ్రిలోని జీజీహెచ్‌లో వైద్య సేవలు అందిస్తున్నా పలు విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. అక్కడ రోగులు పొందుతున్న వైద్య సేవలపై ఆరా తీసి, వారితో రోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
News February 14, 2025
రాజమండ్రి: ఫిబ్రవరి 19న పెన్షన్ & జిపిఎఫ్ అదాలత్

ఫిబ్రవరి 19వ తేదీన తూ.గో జిల్లాకు పెన్షన్ కేసులు, జీపీఎఫ్ కేసులను సమీక్షించడానికి పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రపదేశ్ అకౌంటెంట్ జనరల్ విభాగం ఆధ్వర్యంలో రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఈ పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా ట్రెజరీ అధికారి ఎన్.సత్యనారాయణ నోడల్ అధికారిగా వ్యవహారిస్తారని వెల్లడించారు.