News July 13, 2024
ఉమ్మడి తూ.గో జిల్లా నూతన ఎస్పీలు వీరే
☞ తూ.గో జిల్లా ఎస్పీ పి.జగదీశ్ బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో టీటీడీ CVSOగా ఉన్న డి.నరసింహ కిషోర్ ఎస్పీగా రానున్నారు.
☞ కాకినాడ ఎస్పీగా విక్రాంత్ పాటిల్ నియమితులయ్యారు. ప్రస్తుత ఎస్పీ సతీష్ కుమార్ బదిలీపై గుంటూరుకు వెళ్లనున్నారు.
☞ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ ఎస్.శ్రీధర్ బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో బి.కృష్ణారావు ఎస్పీగా రానున్నారు.
Similar News
News October 14, 2024
తూ.గో: పిడుగులు పడతాయి జాగ్రత్త
తూ.గో జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ అధికారులు సోమవారం పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేశారు. రాజమండ్రి రూరల్, రావులపాలెం, కోనసీమ, తుని, మారేడుమిల్లి, రంపచోడవరం, పెద్దాపురం, సామర్లకోట కోరుకొండ, రాజమండ్రి రూరల్ పరిధిలో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నివారణ సంస్థ ప్రజల చరవాణిలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది.
News October 14, 2024
ఆత్రేయపురం: నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి.. నిందితుడి అరెస్టు
ఆత్రేయపురం మండలంలో ఈ నెల 11న ఓ గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలికను రాత్రి సమయంలో అదే గ్రామానికి చెందిన శివ అనే యువకుడు మాయమాటలతో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆ బాలిక అమ్మమ్మకు చెప్పింది. ఈ నెల 12వ తేదీన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోక్సో కేసు నమోదు చేసి ఆదివారం శివను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు ఎస్ఐ రాము తెలిపారు.
News October 14, 2024
అమలాపురం: 133 మద్యం షాపులకు 4,087 దరఖాస్తులు
రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన మద్యం పాలసీకి సంబంధించి అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న 133 షాపులకు గాను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా మొత్తం 4,087 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ తెలిపారు. ఈనెల 14వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుంచి అమలాపురం కలెక్టరేట్‌లో అభ్యర్థుల సమక్షంలో కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ లాటరీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు.