News September 10, 2024
ఉమ్మడి తూ.గో.లో విజృంభిస్తున్న విష జ్వరాలు
ఉమ్మడి తూ.గో. జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 162 PHCలు, 12 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏడు ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో నిత్యం సగటున 2వేల వరకు సీజనల్ జ్వరాల కేసులు నమోదు కావడం కలవర పెడుతోంది. వీటికి తోడు ప్రైవేటు ఆసుపత్రుల్లో వేలాది మంది చికిత్స పొందుతున్నారు. గత నెలలో 50 వేల కేసులు, ఈ నెలలో ఇప్పటివరకు 13వేల కేసులు నమోదయ్యాయి.
Similar News
News October 3, 2024
ఉమ్మడి తూ.గో.జిల్లా టాప్ న్యూస్
* జిల్లాలో రేపటి నుంచి టెట్ పరీక్షలు
* శంషాబాద్‌లో కోనసీమ వాసి మృతి
* రేపు తుని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మినీ జాబ్ మేళా
* రాజమండ్రి: ఉద్యోగాల పేరిట టోకరా.. రూ.కోటితో పరార్
* మంత్రి లోకేశ్‌ను కలిసిన ఎమ్మెల్యే చినరాజప్ప
* తూ.గో: బీజేపీలో చేరిన 300 కుటుంబాలు
* కాకినాడ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సులు
* ఎంపీ పురందీశ్వరికి పామాయిల్ రైతుల వినతి
* 35 రోజుల వాడపల్లి వెంకన్న ఆదాయం రూ.1,08,89,635
News October 3, 2024
నిడదవోలులో రేపు జాబ్ మేళా
నిడదవోలు ఎస్వీఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తూ.గో.జిల్లా ఉపాధి కల్పనాధికారి సుధాకర్ తెలిపారు. ఉదయం 9 గంటలకు జాబ్ మేళా మొదలవుతుందని, 5 కంపెనీల ప్రతినిధులు ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. SSC, డిప్లొమా, డీఫార్మసీ, ఇంటర్, డిగ్రీ, బీ-ఫార్మసీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంబీఏ, ఎంసీఏ ఎం-ఫార్మసీ చదివిన 19-30 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు అర్హులన్నారు.
News October 3, 2024
రాజోలు: రోడ్డు ప్రమాదంలో హైస్కూల్ హెడ్ మాస్టర్ మృతి
సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం గ్రామంలో వెలంకాయల కాలవగట్టు ప్రాంతానికి చెందిన సుజాత కేశదాసుపాలెం హైస్కూల్లో హెడ్ మాస్టర్‌గా విధులను నిర్వర్తిస్తున్నారు. డ్యూటీ నిమిత్తం ఆమె స్కూటీపై వెళ్తూండగా గొయ్యిని తప్పించే ప్రయత్నంలో పడిపోవడంతో తలకు బలమైన గాయాలు అయ్యాయి. కాకినాడ అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల పలువురు ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.