News August 27, 2024
ఉమ్మడి నల్గొండలో గృహజ్యోతి పరిస్థితి ఇదీ

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం గృహ విద్యుత్తు కనెక్షన్లు 13,85,385 ఉన్నాయి. 8,78,360 కనెక్షన్లకు సున్నా బిల్లులు వస్తుండగా, 5,07,025 కనెక్షన్ల లబ్ధిదారులు పథకం ఫలాలు పొందటం లేదు. వాణిజ్య కనెక్షన్లు మినహా కొంతమంది బిల్లులు చెల్లిస్తున్నారు. దరఖాస్తుల సవరణకు ప్రభుత్వం పురపాలికలు, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఏడు నెలలుగా గృహజ్యోతికి సంబంధించిన సైట్ తెరుచుకోలేదు.
Similar News
News November 14, 2025
NLG: 17 నుంచి పత్తి కొనుగోలు బంద్

సీసీఐ తీరుపై మరోసారి కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులతోపాటు కాటన్ మిల్లులను ఇబ్బందులకు గురిచేసేలా పత్తి కొనుగోళ్లల్లో కఠిన నిబంధనలను సడలించాలన్న విజ్ఞప్తిని సీసీఐ పట్టించుకోకపోవడంతో మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈనెల 17వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రకటించింది.
News November 14, 2025
NLG: యాసంగి ప్రణాళిక@6,57,229 ఎకరాలు

యాసంగి సాగు ప్రణాళికను NLG జిల్లా వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. గత యాసంగి సీజన్ లో వరి, ఇతర పంటలు కలిపి 6,49,712 ఎకరాల్లో రైతులు సాగు చేయగా.. ప్రస్తుత యాసంగి సీజన్లో 6,57,229 ఎకరాల్లో సాగు కానున్నట్లు వ్యవసాయశాఖ అంచనాలు వేసింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలను రూపొందించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ తెలిపారు.
News November 13, 2025
విద్యార్థులను చూసి చలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం వద్ద ఆటోలో ప్రమాదకర స్థితిలో వెళ్తున్న మోడల్ స్కూల్ విద్యార్థులను చూసి చలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆటోను ఆపి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల సమయానికి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేయాలని మిర్యాలగూడ ఆర్టీసీ డిపో అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే స్పందన పట్ల స్థానిక ప్రజలు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.


