News August 27, 2024

ఉమ్మడి నల్గొండలో గృహజ్యోతి పరిస్థితి ఇదీ

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం గృహ విద్యుత్తు కనెక్షన్లు 13,85,385 ఉన్నాయి. 8,78,360 కనెక్షన్లకు సున్నా బిల్లులు వస్తుండగా, 5,07,025 కనెక్షన్ల లబ్ధిదారులు పథకం ఫలాలు పొందటం లేదు. వాణిజ్య కనెక్షన్లు మినహా కొంతమంది బిల్లులు చెల్లిస్తున్నారు. దరఖాస్తుల సవరణకు ప్రభుత్వం పురపాలికలు, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఏడు నెలలుగా గృహజ్యోతికి సంబంధించిన సైట్ తెరుచుకోలేదు.

Similar News

News September 12, 2024

నల్లగొండ: గణేష్ నిమజ్జన శోభాయాత్రకు పటిష్ట బందోబస్తు

image

గణేష్ నిమజ్జన శోభాయాత్ర కోసం ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నల్లగొండ డిఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. బుధవారం నల్లగొండ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ.. 9 అడుగుల వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం వల్లభారాపు చెరువు, 9 అడుగుల కంటే ఎక్కువ ఉన్న విగ్రహాల కోసం 14వ మైలురాయి వద్ద నిమజ్జనం ఏర్పాట్లు చేసామని తెలిపారు.

News September 11, 2024

NLG: అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు.!

image

NLGలో 8 మంది జర్నలిస్టులు జీవో నెంబర్ 59లోని లొసుగులను ఆసరా చేసుకొని ఇరిగేషన్ శాఖకు చెందిన కోట్ల విలువ చేసే భూమిని గతేడాది అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కోరుతూ జర్నలిస్టులు అప్పటి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ చేయించారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

News September 11, 2024

NLG: భౌమాకోన్ ఎక్స్ పో ఇండియాకు రావాలని మంత్రి కోమటిరెడ్డికి ఆహ్వానం

image

అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఎక్విప్ మెంట్ మ్యాన్ ఫ్యాక్చరర్స్‌తో కలిసి ‘మెస్సె ముంచన్ ఇండియా’ సంస్థ డిసెంబర్ 11 నుంచి 14 వరకు గ్రేటర్ నోయిడాలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ‘భౌమాకోన్ ఎక్స్ పో ఇండియా’కు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నిర్వాహకులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందించారు. ప్రతీయేటా నిర్మాణ రంగంలో వస్తున్న అధునాతన పరికరాలు, టెక్నాలజీలను ఈ ఎక్స్ పోలో ప్రదర్శిస్తారు.