News April 10, 2025
ఉమ్మడి నల్గొండ జిల్లాకు వర్ష సూచన

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పింది. BNG, NLG, SRPT జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉండడంతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News November 16, 2025
పల్నాడు: కాక రేపుతున్న వారసత్వ రాజకీయాలు

పల్నాడు జిల్లాలో వారసత్వ రాజకీయాలు కాక రేపుతున్నాయి. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్న యరపతినేని శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, జీవి ఆంజనేయులు తమ వారసులను రాజకీయ బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముందు నుంచే తమ వారసులను ప్రజలలోకి పంపి రాజకీయ ఒడిదుడుకులపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.
News November 16, 2025
త్వరలో HYDలో ఎనిమీ ప్రాపర్టీ ప్రాంతీయ కార్యాలయం

రాష్ట్రంలో ఎనిమీ ప్రాపర్టీలు పరిరక్షణ కోసం HYDలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ముంబై ప్రాంతీయ కార్యాలయం తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల వ్యవహారాలు చూస్తోంది. హైదరాబాద్- రంగారెడ్డి జిల్లాల్లో ఎనిమీ ప్రాపర్టీలపై రెవెన్యూశాఖ సర్వే నిర్వహించింది. మియాపూర్ పరిధిలో వందల ఎకరాలు ఉండగా, కొంతభాగం అక్రమ ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు.
News November 16, 2025
కిలిమంజారోను అధిరోహించిన అనంత జిల్లా యువతి

అనంతపురం(D) నార్పల(M) దుగుమర్రికి చెందిన కె.కుసుమ(19) ఈ నెల 8న హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫ్రీస్టాండింగ్ పర్వతం కిలిమంజారో (5895M)ను 12న విజయవంతంగా అధిరోహించింది. శిఖరంపై జాతీయ జెండాతో పాటు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, MLA బండారు శ్రావణి ఫొటోలను ఎగురవేసింది. 15న హైదరాబాద్‌కు చేరుకోనుంది.


