News April 10, 2025
ఉమ్మడి నల్గొండ జిల్లాకు వర్ష సూచన

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పింది. BNG, NLG, SRPT జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉండడంతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News November 1, 2025
జిఎన్ఎం కోర్సులో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

నల్గొండ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ జనరల్ నర్సింగ్, మిడ్ వైపరీ (జీఎన్ఎం) 3 సంవత్సరాల శిక్షణ కోర్సులో ప్రవేశానికి అర్హత గల పురుష, మహిళా అభ్యర్థుల నుంచి నవంబరు 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా వైద్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు డిఎంహెచ్వో కార్యాలయంలో సంప్రదించాలని ఆయన తెలిపారు.
News November 1, 2025
పెండింగ్ రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్

నల్గొండ జిల్లాలలో పెండింగ్‌లో ఉన్న వివిధ రెవెన్యూ దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం రెవెన్యూ అంశాలపై ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న భూ రికార్డులు, భూ భారతి, భూ వివాదాల దరఖాస్తుల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 1, 2025
పెద్దవూర పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలోని పెద్దవూర పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, సిబ్బంది పనితీరు, పోలీస్ స్టేషన్ పరిధిలోని భౌగోళిక వివరాల గురించి ఎస్సైని అడిగి తెలుసుకున్నారు.


