News March 19, 2024
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎంపీ ఎన్నికలపై కసరత్తు

లోక్సభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈవీఎంల చెకింగ్ పూర్తి కాగా.. క్షేత్రస్థాయిలో పోలింగ్ సజావుగా సాగడానికి కావాల్సిన ఏర్పాట్లను NLG, SRPT, YDD జిల్లాల కలెక్టర్లు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పర్యవేక్షిస్తున్నారు. NLG లోక్సభ స్థానానికి కలెక్టర్ హరిచందన రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనుండగా, BNGకి హనుమంతు కె జెండగే ఆర్వోగా వ్యవహరిస్తారు.
Similar News
News October 22, 2025
నల్గొండ: మైనర్ బాలిక కేసులో నిందితుడికి 32 ఏళ్ల జైలు శిక్ష

మైనర్ బాలికను మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకొని, అత్యాచారం చేసిన కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు గురజాల చందుకు ఏకకాలంలో మొత్తం 32 ఏళ్ల జైలు శిక్ష, రూ.75 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు చెప్పింది. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.
News October 22, 2025
అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

నల్గొండ జిల్లాలోని వెటర్నరీ & అనిమల్ హస్బెస్టరీ, ఫిషరీష్ డిపార్ట్మెంట్ లలో డేటాఎంట్రీ ఆపరేటర్స్ (3), ఆఫీస్ సబార్డినేట్స్ (38) పోస్టులకు అవుట్సోర్సింగ్ సేవలను అందించటానికి ఎమ్ పానెల్ అయిన ఆసక్తి గల అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. ఈనెల 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
News October 22, 2025
కొండమల్లేపల్లి: ఆదుకుంటే.. చదువుకుంటాం..

కొండమల్లేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన రోజువారీ కూలీలైన సైదమ్మ-వెంకటయ్య కుమార్తెలు ఉన్నత చదువులకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కూతురు తేజశ్రీకి రామగుండంలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. ఏడాది ఫీజు ₹ 1,22,000 కాగా, ఆమె అక్కకు ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం ఫీజు ₹ 1,88,000 చెల్లించలేని స్థితిలో ఉన్నారు. ఇద్దరూ ప్రస్తుతం కూలి పనులకు వెళ్తున్నారు. దాతలు ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.