News March 10, 2025
ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి నలుగురు..!

ఎమ్మెల్యే కోటా MLC ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులు ఖరారయ్యారు. కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల నుంచి పోటీ చేయనుండగా, ఆ పార్టీ మిత్రపక్షం CPIకి ఒక స్థానాన్ని కేటాయించింది. మరో స్థానంలో BRS పోటీ చేయనుంది. దీంతో అభ్యర్థుల ఎన్నికల లాంఛన ప్రాయం కానుంది. కాంగ్రెస్ పార్టీ ముగ్గురు అభ్యర్థులు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, CPI అభ్యర్థి నెల్లికంటి సత్యం, BRS అభ్యర్థి దాసోజు శ్రవణ్ కూడా NLG జిల్లాకు చెందిన వారే.
Similar News
News December 1, 2025
ఖమ్మంలో ఎన్నికల వేడి.. ప్రత్యర్థులను తప్పించే ప్రయత్నాలు!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తొలి విడత నామినేషన్లు పూర్తి కావడం, రెండో విడత ప్రారంభం కావడంతో గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. తమ గెలుపుపై ప్రభావం చూపుతారని భావించిన కొందరు అభ్యర్థులు, డబ్బు లేదా ఇతర మార్గాల ద్వారా ప్రత్యర్థులను పోటీ నుంచి తప్పించే ప్రయత్నాల్లో శరవేగంగా నిమగ్నమయ్యారు.
News December 1, 2025
HNK: సర్పంచ్ ఎన్నికలు.. సోషల్ మీడియాపై అభ్యర్థుల ఫోకస్

జిల్లాలో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న నేపథ్యంలో సర్పంచ్కు పోటీ చేయాలనుకునే అభ్యర్థులు సోషల్ మీడియాపై ప్రత్యేక ఫోకస్ పెట్టి తమను గెలిపిస్తే చేసే పనులు, ఎజెండాలను స్టేటస్, గ్రూప్స్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం ఏ మాత్రం ఉంటుందో చూడాల్సి ఉంది.
News December 1, 2025
కడప: ‘సమస్యలపై ఇవాళ రాకండి’

కడప జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుసే అవకాశం ఉండడంతో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆదేశాలతో రద్దు చేశారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర్ నాయుడు ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఉండే వికలాంగులు, దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు వినతులు ఇచ్చేందుకు రావొద్దని ఆయన సూచించారు.


