News July 29, 2024

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎస్సైల బదిలీలు

image

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని స్టేషన్లలో పనిచేస్తున్న ఎస్సైలను బదిలీ చేస్తూ సోమవారం డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. నార్కెట్ పల్లి ఎస్సైగా క్రాంతి కుమార్, చిట్యాల ఎస్సైగా ధర్మ, నాగారం ఎస్సైగా ఐలయ్య, నూతనకల్ ఎస్సైగా మహేంద్ర నాథ్, తిరుమలగిరి ఎస్సైగా సురేశ్, అర్వపల్లి ఎస్సైగా బాలకృష్ణ బదిలీ అయ్యారు.

Similar News

News November 6, 2025

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

image

నల్గొండ మండలం చర్లపల్లిలోని హాకా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె కేంద్రంలోని ధాన్యాన్ని పరిశీలించి, కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం తడవకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లారీల కొరత లేకుండా సకాలంలో వాటిని వెంటవెంటనే పంపించాలని పేర్కొన్నారు.

News November 6, 2025

NLG: అట్టహాసమే.. కానరాని ‘వికాసం’!

image

జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు రాయితీ రుణాల కోసం ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల అధికారులు రాజీవ్ యువ వికాసం పేరిట ధరఖాస్తులు స్వీకరించారు. ప్రభుత్వ ఉద్యోగాలు అంతంత మాత్రంగానే ఉండడంతో ఈ పథకంతో స్వయం ఉపాధికి బాటలు వేసుకోవచ్చనే ఉద్దేశంతో సుమారు 80 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

News November 6, 2025

NLG: రిజిస్ట్రేషన్ చివరి తేదీ మరో 4 రోజులే

image

వికసిత భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వికసిత్ భారత్ ప్రోగ్రాం చైర్మన్, నల్గొండ ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ సముద్రాల ఉపేందర్ కోరారు. దేశాభివృద్ధిలో విద్యార్థుల సృజనాత్మకత సందేశాత్మక వీడియో రూపొందించి అసెంబ్లీ, పార్లమెంటులో మాట్లాడే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. అందుకు ఈనెల 10వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.