News October 30, 2024

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 29,64,914 మంది ఓటర్లు

image

ఉమ్మడి NLG జిల్లాలో 29,64,914 మంది ఓటర్లు ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తుది ముసాయిదా ఓటర్ జాబితాను మంగళవారం పోలింగ్ కేంద్రాల్లో ప్రకటించారు. NLG లో 15,02,203, SRPTలో 10,04,284, యాదాద్రి భువనగిరిలో 4,58,426 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వారిలో 14,58,709 మంది పురుషులు, 15,06,000 మంది మహిళలు, 204 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు.

Similar News

News November 10, 2024

18 లోగా పరీక్ష ఫీజులు చెల్లించాలి: డీఈఓ భిక్షపతి

image

2025 సంవత్సరం మార్చి నెలలో జరిగే 10వ తరగతి వార్షిక పరీక్షల ఫీజును ఈనెల 18లోగా చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. రూ. 50 అపరాధ రుసుముతో డిసెంబర్ 2, రూ.200 అపరాధ రుసుముతో డిసెంబర్ 12, రూ. 500 అపరాధ రుసుముతో డిసెంబర్ 21 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

News November 10, 2024

సర్వేలో జిల్లా వ్యాప్తంగా 5 లక్షల 3,411 ఇండ్లు గుర్తింపు

image

సమగ్ర కుటుంబ సర్వేలో జిల్లాలో 5 లక్షల 3,411 ఇండ్లను గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఇండ్ల జాబితాను పూర్తి చేయడం జరిగిందని, శనివారం నుంచి కుటుంబ వివరాల సేకరణను ప్రారంభించినట్లు తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేపై శనివారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా ప్రతినిధులు సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.