News July 22, 2024
ఉమ్మడి నిజామాబాద్‌లో ఊపందుకున్న వ్యవసాయ పనులు
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో పంటల సాగు ఊపందుకుంది. జిల్లాలోని వివిధ గ్రామాల్లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వ్యవసాయభూములు తడిసి విత్తనాలు వేసుకోవడానికి అనుకూలంగా మారాయి. దీంతో జిల్లాలో నల్లరేగడి భూములు అధికంగా ఉండడంతో రైతులు పత్తి, మొక్కజొన్న, తదితర పంటలు సాగు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొన్నిచోట్ల రైతులు భూమిని దున్ని విత్తనాలు నాటుతున్నారు.
Similar News
News December 12, 2024
NZB: ఇందిరమ్మ ఇళ్ల సర్వేను తనిఖీ చేసిన కలెక్టర్
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా నిర్వహిస్తున్న మొబైల్ యాప్ సర్వేను నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం పరిశీలించారు. ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి, పెర్కిట్ గ్రామాల్లో సర్వేను పరిశీలించారు. కలెక్టర్ స్వయంగా దరఖాస్తుదారుల ఇళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
News December 12, 2024
మెండోరా: ఏడాదిగా మూసి ఉన్న ATM
మెండోరా మండలం పోచంపాడ్ చౌరస్తాలోని SBI ATM ఏడాదిగా మూసిఉంది. 2023 SEPలో దొంగలు ATMలో చోరీ చేసి రూ.12లక్షలు ఎత్తుకెళ్లడంతో అప్పటినుంచి అది మూతపడి ఉంది. మండలం చుట్టుపక్కల ATMలు లేకపోవడంతో నగదు విత్‌డ్రా చేసుకోవడానికి ప్రైవేటు వ్యక్తులకు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తోందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో నిర్మల్ లేదా బాల్కొండ వెళ్లాల్సి వస్తోందని, అధికారులు స్పందించి దాన్ని ఓపెన్ చేయాలని కోరారు.
News December 12, 2024
NZB: తాగుబోతు ఎఫెక్ట్.. నిలిచిన ట్రాఫిక్
నిజామాబాద్ నీలకంఠేశ్వర దేవాలయం సమీపంలో ఓ తాగుబోతు బుధవారం రాత్రి హల్చల్ చేశాడు. అక్కడి ఓ వైన్స్ ఎదుట రోడ్డుకు అడ్డంగా కూర్చొని ట్రాఫిక్ కు అంతరాయం కలిగించాడు. దీంతో నిజామాబాద్- ఆర్మూర్ ప్రధాన రూట్ లో ట్రాఫిక్ స్తంభించి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంబులెన్స్ సైతం ట్రాఫిక్‌లో చిక్కుకు పోయింది.