News July 29, 2024
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పల్లెల్లో పంచాయతీ సందడి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనీ 1,373 గ్రామ పంచాయతీలో ఎన్నికల సందడి మొదలైంది. సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా.. పాత, కొత్త లీడర్లలో ఆశలు రేకెత్తాయి. కొత్త రిజర్వేషన్లు ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని అధికారులు చెప్పడంతో పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం సలహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చాప కింద నీరు లాగా పంచాయతీ సందడి మొదలైంది.
Similar News
News October 17, 2025
నిజామాబాద్: జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో విజ్ఞాన యాత్ర

పసుపు రైతుల నైపుణ్యాల అభివృద్ధి కోసం జిల్లా కేంద్రంలోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో విజ్ఞాన యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. పసుపు రైతులకు కొత్త అవకాశాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కలిగించే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
News October 17, 2025
నిజామాబాద్: రేపటి బంద్కు సంపూర్ణ మద్దతు: ఎమ్మెల్సీ కవిత

బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టే బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ పాస్ చేసిన బిల్లులను ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్లో పెట్టిన బీజేపీ ఇప్పుడు బంద్లో పాల్గొంటోందన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులు పాస్ చేసినట్టు భావించాలా అన్నారు. కేంద్రంపై కొట్లాడకుండా ఉత్తుత్తి జీవో ఇచ్చిన కాంగ్రెస్ బంద్లో పాల్గొనడం హాస్యాస్పదమని ట్వీట్ చేశారు.
News October 17, 2025
NZB: గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

నిజమాబాద్లో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు మూడవ టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. రైల్వే స్టేషన్ ప్రాంతంలో పెట్రోల్ నిర్వహిస్తుండగా పెంబోలి రైల్వే ట్రాక్ వద్ద ఓ వ్యక్తి పోలీసులు చూసి పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. అతడి నుంచి 110 గ్రాముల గంజాయి స్వాదినపరుచుకుని రిమాండ్కు తరలించమన్నారు.