News September 1, 2024

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

*ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దంచికొట్టిన వాన *NZB, KMR ప్రాజెక్టులకు పోటెత్తిన వరద *NZB రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి *KMR డెంగ్యూతో వ్యక్తి మృతి *ACBకి పట్టుబడ్డ ఇన్‌ఛార్జ్ అర్వో నరేందర్ సస్పెండ్ *బిక్కనూర్ వరద నీటిలో చిక్కిన వారిని కాపాడిన పోలీసులు *డిచ్పల్లి: వివాహితది ఆత్మహత్య కాదు.. హత్య *బాన్సువాడ ప్రేయసిన హత్య చేసిన ప్రియుడు.

Similar News

News September 17, 2024

NZB: డిఫెన్స్ మినిస్టర్‌ను కలిసిన ఎంపీ అరవింద్

image

కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ రంజిత్ సింగ్‌ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని డిఫెన్స్ మినిస్టర్ నివాస గృహంలో కలిసి పలు అంశాలపై చర్చించారు. ఎంపీ అరవింద్ చేసే ప్రతి కార్యక్రమాల విషయంలో డిఫెన్స్ మినిస్టర్ సలహా సూచనలను తీసుకునే నేపథ్యంలో ఆయనతో కలిసి ఫ్లవర్ బొకే అందజేసి శాలువాతో సత్కరించారు.

News September 17, 2024

కేటీఆర్‌ను కలిసిన KMR మాజీ ZP ఛైర్మన్ దఫెదర్ రాజు

image

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగిన జాతీయ సమైఖ్యత దినోత్సవ కార్యక్రమంలో కేటిఆర్‌ను KMR మాజీ ZP ఛైర్మన్ దఫెదర్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. కేటిఆర్‌తో కలిసి జెండా ఆవిష్కరణ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలభిషేకం చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ ZP ఛైర్మన్ దఫెదర్ రాజు, NZB మాజీ జిల్లా ఛైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, కామారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు ముజీబుద్దిన్ ఉన్నారు.

News September 17, 2024

NZB: సార్వజనిక్ గణేశ్ మండలి వద్ద ఎమ్మెల్యేలు, కలెక్టర్, సీపీ పూజలు

image

వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, NZB అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం దుబ్బ ప్రాంతంలోని సార్వజనిక్ గణేశ్ మండలి వద్దకు చేరుకొని కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనోత్సవాలు జరుపుకోవాలని కలెక్టర్, సీపీ సూచించారు.