News October 10, 2024
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB డైరెక్టర్ కమలాకర్ రెడ్డి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB డైరెక్టర్‌గా నియమితులైన బీర్కూర్ మండలం దామరంచ సొసైటీ ఛైర్మన్ కమలాకర్ రెడ్డిని పలువురు బుధవారం రాత్రి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో బీర్కూర్ మండల కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి, పోగు పాండు, ఓంకార్, ఈరాజ్ సాయిలు, నర్ర సాయిలు, సమద్, సతీష్, పిర్గొండ సతీష్, రాజు, బాన్సువాడ నియోజకవర్గం సోషల్ మీడియా ఇన్‌ఛార్జి బోయిడి లక్ష్మణ్ ముదిరాజ్ ఉన్నారు.
Similar News
News November 6, 2024
లింగంపేట: నాగన్న బావిని పరిశీలించిన కలెక్టర్
లింగంపేట మండల కేంద్రంలో ఉన్న నాగన్న బావిని ఇవాళ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నాగన్న బావిని టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేయాలని, కాటేజీలు ఏర్పాటుకు ప్రతిపాదించారు. బావిలో ఉన్న చెత్తను తొలగించాలని, సమీపంలో మొక్కలు నాటి సంరక్షించాలని వారు సూచించారు. అనంతరం బావి చూడడానికి వచ్చిన పాఠశాల చిన్నారులతో పురాతన బావి దాని చరిత్ర గురించి తెలుసుకోవాలని అన్నారు.
News November 5, 2024
NZB: మెడికల్ షాపులో చోరీకి పాల్పడ్డ దుండగులు
నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడీ ప్రాంతంలో ఉన్న ఓ మెడికల్ షాప్‌లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి బైక్‌పై వచ్చిన ముగ్గురు మెడికల్ షాప్ తాళం పగులగొట్టి లోనికి చొరబడి రూ.5 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఇది అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News November 5, 2024
ఖతర్‌లో ముప్కాల్ వాసి గుండెపోటుతో మృతి
ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన తాడూరి లింబాద్రి (58) గురువారం రోజు రాత్రి గుండెపోటుతో మరణించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుడు గత కొన్ని సంవత్సరాలుగా దోహాలో ఉపాధి నిమిత్తం జీవనం కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేలా ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.