News December 17, 2024

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు వివరాలు

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిన్నటికి, నేటికీ నిలకడగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని హైద్రాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కామారెడ్డి జిల్లాలో అత్యల్పంగా జుక్కల్ 6.9, మేనూర్ 7.4, బిచ్కుంద 8.2,సర్వాపూర్, రామలక్ష్మణపల్లి 8.4, డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో కోటగిరి 8.8, గోపన్ పల్లి 9.1,నిజామాబాద్, సాలుర, పోతంగల్ లో 9.3డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

Similar News

News December 11, 2025

నిజామాబాద్ జిల్లాలో భారీ మెజారిటీతో తొలి విజయం

image

మోస్రా మండలం దుబ్బ తండా గ్రామ పంచాయతీ సర్పంచిగా లునావత్ శివ 114 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గ్రామంలో మొత్తం 254 ఓట్లు పోలయ్యాయి. 184 ఓట్లు గెలుపొందిన అభ్యర్థి లునావత్ శివకుమార్‌కు రాగా ప్రత్యర్థి వీరన్నకు 70 ఓట్లు పోలయ్యాయి. భారీ విజయంతో సర్పంచి పీఠం లునావత్ శివ కైవసం చేసుకోవడంతో గ్రామంలో ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.

News December 11, 2025

కామారెడ్డి జిల్లాలో 5 ఓట్ల తేడాతో తొలి విజయం

image

బిక్కనూరు మండలం ర్యాగట్లపల్లి గ్రామ సర్పంచిగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి భాగ్యమ్మ విజయం సాధించారు. తమ సమీప అభ్యర్థి లక్ష్మీపై ఐదు ఓట్ల తేడాతో భాగ్యమ్మ విజయం సాధించారు. దీంతో గ్రామంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. సర్పంచ్ స్థానం కోసం పోటాపోటీగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రచారం కొనసాగింది. చివరకు బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు.

News December 11, 2025

నిజామాబాద్‌లో పోలింగ్ శాతం ఎంత అంటే?

image

తొలి దశ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన మధ్యాహ్నం1 గంట వరకు 164 GPల్లో నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది. బోధన్ మండలంలో 84.88%, చందూరు-79.95%, కోటగిరి-78.05%, మోస్రా-76.09%, పొతంగల్- 82.21%, రెంజల్- 80.91%, రుద్రూరు-84.05%, సాలూర-85.91%, వర్ని-78.74%, ఎడపల్లి-67.11%, నవీపేట-76.78% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.